'ఫోన్ లాక్కుని చూశా'.. చిరంజీవి ప్రశంసకు గాల్లో తేలిపోతున్న నిఖిల్!

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం అర్జున్ సురవరం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. టి సంతోష్ దర్శత్వంలో ఈ చిత్రం తెరెక్కుతోంది. కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ నిఖిల్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. నిఖిల్ కొత్తగా ట్రై చేసిన ప్రతి సారి మంచి విజయం దక్కుతోంది. అర్జున్ సురవరం చిత్రం కూడా వైవిధ్యభరితమైన కథతోనే వస్తోంది. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు. మొదట ఈ చిత్రానికి ముద్ర అనే టైటిల్ అనుకున్నారు. అది వివాదం కావడంతో అర్జున్ సురవరం అని మార్చారు. శివరాత్రి సందర్భంగా సోమవారం అర్జున్ సురవరం టీజర్ విడుదల చేశారు. టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

దూసుకుపోతున్న టీజర్

దూసుకుపోతున్న టీజర్

టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ లభించాయి. టీజర్ లో బిబిసి న్యూస్ జర్నలిస్ట్ గా నిఖిల్ అదరగొట్టేస్తున్నాడు. టీజర్ ఈ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెంచిందని చెప్పొచ్చు. డైలాగులు కూడా పదునుగా ఉన్నాయి. అర్జున్ సురవరం చిత్రాన్ని మార్చ్ 29న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉండగా అర్జున్ సురవరం టీజర్ కు లభించిన రేర్ కాంప్లిమెంట్ కు నిఖిల్ పొంగిపోతున్నాడు.

ఫోన్ లాక్కుని చూశా

అర్జున్ సురవరం టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రొడ్యూసర్ కు పలువురు మెసేజ్ పెడుతూ ప్రశంసిస్తున్నారు. ఓ మెసేజ్ చదువుతూ నిర్మాత చాలా సంబరపడిపోతున్నారు. ఎవరా అని ఫోన్ లాక్కుని చూశా.. మై గాడ్.. అది స్వయంగా మెగాస్టార్ చిరంజీవి. అర్జున్ సురవరం టీజర్ ని బాస్ చిరంజీవి ప్రశంసించారు. ఇది నా జీవితంలో మరచిపోలేని రోజు అని నిఖిల్ తెలిపాడు.

 ఆసక్తికరంగా

ఆసక్తికరంగా

చిరంజీవి అనుమతి తీసుకుని ఆయన పంపిన మెసేజ్ ని షేర్ చేస్తున్నా అని నిఖిల్ ట్వీట్ చేశాడు. ఇప్పుడే అర్జున్ సురవరం టీజర్ చూశా. చాలా ఆసక్తికరంగా ఉంది. నీకు, దర్శకుడికి, హీరో నిఖిల్ కు ఆల్ ది బెస్ట్ అని చిరు పంపిన మెసేజ్ ఉంది. అర్జున్ సురవరం నిర్మాత రాజ్ కుమార్ కు చిరు ఈ మెసేజ్ పెట్టారు. పెద్ద పెద్ద స్కాములని బయటకు తీసే జర్నలిస్ట్ గా నిఖిల్ నటిస్తున్నాడు.

 లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి

ఈ చిత్రంలో నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. శ్యామ్ సంగీతం అందిస్తున్నాడు. పోసాని, వెన్నెల కిషోర్ లాంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదట ఈ చిత్రానికి ముద్ర అనే టైటిల్ ప్రకటించారు. కానీ ఆ టైటిల్ నాది అంటూ నిర్మాత నట్టి కుమార్ చెప్పడంతో వివాదంగా మారింది. పరస్పర విమర్శల అనంతరం ఈ చిత్రానికి అర్జున్ సురవరం అని టైటిల్ మార్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X