Acharya కోసం మహేష్ బాబు.. మొదటిసారి స్పందించిన చిరంజీవి.. అలా ఫీల్ అవుతారు అంటూ..
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కలయికలో వస్తున్న మొట్ట మొదటి చిత్రం ఆచార్య పై రోజురోజుకు అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ కూడా ఒక ప్రత్యేకమైన పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక మొదటి రోజు మొదటి షో చూడాలి అని ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కూడా ఒక ప్రత్యేకమైన భాగం అవ్వడం విశేషం. ఆయన వాయిస్ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని.. మెగాస్టార్ చిరంజీవి కూడా మహేష్ బాబు వాయిస్ ఓవర్ పై అఫీషియల్గా క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ స్థాయిలో రిలీజ్
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా గత ఏడాది నుంచి ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తోంది. కరోనా పరిస్థితుల కారణంగా చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెలలో విడుదల కాబోతోంది. ఏప్రిల్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఒక విధంగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే ఈ సినిమా అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతోంది.

మహేష్ కూడా..
అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కూడా ఒక భాగం కానున్నట్లుగా గత ఏడాది నుంచి అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అసలైతే మొదట మహేష్ బాబు ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడని టాక్ అయితే వచ్చింది. కానీ ఆ తర్వాత దర్శకుడు కొరటాల కాంబినేషన్ సరిగ్గా సెట్ అవ్వడం లేదు అని ఆలోచనలు మార్చుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఏ మాత్రం ఆలోచించలేదు
ఏదేమైనప్పటికీ కూడా ఆచార్య సినిమాలో మొత్తానికి మహేష్ బాబు కూడా ఒక భాగాన్ని పంచుకున్నాడు. సినిమా కథకు చాలా ముఖ్యమైనటువంటి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవికి మహేష్ బాబుకు ముందు నుంచి చాలా సాన్నిహిత్యం ఉంది. అంతే కాకుండా రామ్ చరణ్ కూడా చాలా మంచి స్నేహితుడు. దానికితోడు ఇదివరకే డైరెక్టర్ కొరటాల శివతో రెండు మంచి చిత్రాలు చేశాడు. అందుకే మహేష్ బాబు ఆచార్య సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించలేదు.
కృతజ్ఞతలు చెప్పిన చిరంజీవి
అయితే నిన్నటి వరకు ఈ విషయంపై అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. కానీ ఎవరూ కూడా అఫీషియల్గా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక మొత్తానికి కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి.. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు చెబుతూ.. అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

థ్రిల్ అవుతారని..
ప్రియమైన మహేష్ ఆచార్యలో మీ మనోహరమైన స్వరంలో 'పాదఘట్టం'ని పరిచయం చేసినందుకు సంతోషిస్తున్నాను. చాలా ప్రత్యేకమైన రీతిలో సినిమాలో భాగమైనందుకు ధన్యవాదాలు. రామ్ చరణ్ కు అలాగే నాకు నచ్చినంతగా అభిమానులు & ప్రేక్షకులు మీ మాట వినడానికి థ్రిల్ అవుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.. అని చిరంజీవి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











