రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై మొదటిసారి స్పందించిన మెగాస్టార్.. కూతురికి ధైర్యం చెబుతూ..

సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవల కోవిడ్ కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. కుటుంబంలో అందరికి కరోనా సోకిందని సోషల్ మీడియా ద్వారా ఇటీవల చెప్పిన ఆయన వీలైనంత త్వరగా అందరం కొలుకుంటామని చెప్పారు. అయితే ఇటీవల శివాత్మిక తన తన తండ్రి ఆరోగ్య పరిస్థితి కాస్తా కష్టంగానే ఉందని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక మెగాస్టార్ చిరంజీవి రాజశేఖర్ కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

ఆరోగ్యం క్రిటికల్ ఉందని..

ఆరోగ్యం క్రిటికల్ ఉందని..

తన కుటుంబం మొత్తం కూడా కరోనా వైరస్ భారిన పడినట్లు ఇటీవల ట్వీట్ చేసిన రాజశేఖర్ ఇప్పటికే తన కూతుళ్లు శివాని, శివాత్మిక కోలుకున్నట్లు తెలిపారు. అయితే తాను జీవిత ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నట్లు వివరణ ఇచ్చిన రాజశేఖర్ త్వరలోనే ఇంటికి చేరుకుంటామని అన్నారు. అయితే ఇంతలోనే ఆయన ఆరోగ్య కొంచెం క్రిటికల్ గానే ఉందని కూతురు చేసిన ట్వీట్ కి అందరు షాక్ అయ్యారు.

క్లారిటీ ఇచ్చిన కూతురు

క్లారిటీ ఇచ్చిన కూతురు

ప్రియమైన ప్రతి ఒక్కరికి కోవిడ్‌తో నాన్నా పోరాటం చాలా కష్టంగా మారింది. అయినప్పటికీ అతను గట్టిగా పోరాడుతున్నాడు. మీ ప్రార్థనల ప్రేమ శుభాకాంక్షలు మమ్మల్ని రక్షిస్తాయని అనుకుంటున్నాను. మమ్మల్ని ఇలానే కొనసాగించాలే బ్లేస్సింగ్స్ అందించండి. నాన్నా త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని అడుగుతున్నాను. మీ ప్రేమతో, అతను బలంగా బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

మెగాస్టార్ ఏమన్నారంటే..

మెగాస్టార్ ఏమన్నారంటే..

ఇక శివాత్మిక చేసిన ట్వీట్ పై మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా స్పందించారు. ప్రియమైన శివత్మికా మీ ప్రేమగల నాన్న మరియు నా సహా నటుడు, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన కోసం అలాగే మీ కుటుంబం కోసం నిత్యం ప్రార్థనలు చేస్తూనే ఉంటాము. ధైర్యంగా ఉండు.. అని మెగాస్టార్ చిరంజీవి వివరణ ఇచ్చారు.

Recommended Video

#Hyderabad Floods Tollywood Heros Huge Donations హైదరాబాద్‌ కోసం ముందుకొచ్చిన టాలీవుడ్.విరాళాలు
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

ఇక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు స్పందించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ లో ఉన్నప్పటికి చికోత్సకు ఆయన బాడీ సహకరిస్తోందని అన్నారు. ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని అంటున్నారు. ప్రస్తుతనికైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X