Acharya Bookings: మొదలైన మెగా సందడి.. ఆన్‌లైన్‌లో బుకింగ్స్ మొదలయ్యేది ఎప్పుడంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మెగా అభిమానులు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆచార్య కూడా ఉంది. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు కూడా భారీ స్థాయిలో సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా లో ఎమోషనల్ సన్నివేశాలతో పాటు మంచి యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఎంతో ఆసక్తిగా ఆకట్టుకుంటాయని అర్థమవుతోంది.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ట్రైలర్ అలాగే సాంగ్స్ కూడా ఈ సినిమాపై చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. చూస్తుంటే మొదటిరోజు ఊహించని విధంగా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయి అనే విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. ఇక బుక్ మై షోలో నాలుగు రోజుల ముందుగానే ఆచార్య సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ముందుగా నైజాం ఏరియాలో బుకింగ్స్ ను ఈరోజు సాయత్రం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది.

Megastar chiranjeevi Acharya movie advance bookings update

నైజాం ఏరియాలో కూడా పూర్తిస్థాయిలో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు గానీ రేపటి నుంచి మాత్రం దాదాపు అన్ని ఏరియాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏషియన్ మల్టిప్లెక్స్ లలో కూడా రేపటి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతాయని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో కూడా రేపటి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవుతాయని డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా తెలుస్తోంది.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయబోతున్నట్లు చెబుతున్నారు. తప్పకుండా సినిమా మొదటి రోజే ఊహించని విధంగా భారీ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుందని సమాచారం. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ప్రతి ఒక్క సినిమా కూడా ఎవరూ ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నాయి. ఇక ఆచార్య సినిమాలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించడంతో తప్పకుండా కలెక్షన్స్ ఇంకా హై రేంజ్ లోనే ఉంటాయని తెలుస్తోంది.

ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సిద్ధ అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మొదట ఈ పాత్రను కేవలం 15 నిమిషాల అతిధి పాత్ర కోసమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకు నిడివిని పెంచాల్సి వచ్చింది. మొత్తంగా సెకండాఫ్ లో దాదాపు 40 నిమిషాల పాటు కనిపిస్తుందట. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన పాత్రను కూడా సినిమాలో హైలెట్ గా చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తేనే అర్థం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X