ఆచార్య కోసం రెండు స్పెషల్ డేట్స్.. కొరటాల ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య సినిమా ఎప్పుడో వస్తుందో గాని సినిమాకి సంబంధించిన రూమర్స్ రోజుకోటి వైరల్ అవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా వైరస్ వలన సినిమాలు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఎలాగైనా ఆచార్య సినిమాను వచ్చే సమ్మర్ లోనే విడుదల చేయాలని కొరటాల ఒక స్ట్రాంగ్ ప్లాన్ అయితే సెట్ చేసుకున్నట్లు మరో కొత్త కథనం వైరల్ అవుతోంది.
మెగాస్టార్ సపోర్ట్ చేస్తే ఈ నెలలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారట. ముందుగా 50 మంది కంటే ఎక్కువ అవసరం లేని ఎపిసోడ్స్ ని పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి రిస్క్ చేయడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. రామ్ చరణ్ కూడా అందుకు ఒప్పుకోలేదు. దీంతో నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేలా కొత్త షెడ్యూల్ ని సెట్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది.

ఇంకా 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి నవంబర్ లో మొదలుపెడితే నాలుగు నెలల్లో పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఇక మార్చి ఏండింగ్ లో సిద్ధం చేసి ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అలాగే ప్రమోషన్స్ కి సమయం దొరక్కపోతే.. మరో నెలరోజులు వాయిదా వేయాలని అనుకుంటున్నారు. అప్పుడు కుదిరితే మే 7న రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా రెండు డేట్లపై కొరటాల చాలా నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











