RRR ఈవెంట్ లో చిరు బాలయ్య.. అలా ఆలోచిస్తే రావాల్సిందే.. రాజమౌళిలో హై టెన్షన్?

సినిమా ఇండస్ట్రీ లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం RRR. ఈ మూవీ కోసం కేవలం తెలుగు ప్రజలు మాత్రమే కాకుండా మిగతా బాషల్లోని సినీ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలితో బాక్సాఫీస్ హిట్ అందుకున్న అనంతరం విడుదల చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా ప్రస్తుతం అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

నార్త్ లో భారీగా..

నార్త్ లో భారీగా..

గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు రాజమౌళి RRR సినిమా కు సంబంధించిన ప్రమోషన్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే హిందీలో సల్మాన్ ఖాన్ ద్వారా చాలామంది నార్త్ ఆడియెన్స్ కు ఈ సినిమాను చేరువయ్యేలా చేశారు. జక్కన్న ఈ సారి సౌత్ లో కూడా అంతకు మించి అనేలా సక్సెస్ అందుకోవాలని ప్రమోషన్ ను ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది

తెలుగు ఈవెంట్..

తెలుగు ఈవెంట్..

తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ వేడుకకు ముఖ్య అతిథులుగా ఎవరెవరు వస్తారు అనేది కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మెగా నందమూరి హీరోలు నటిస్తున్న సినిమా కాబట్టి రెండు వర్గాల అభిమానులు భారీ స్థాయిలో వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ నెల ఆఖరున ఈవెంట్ జరగవచ్చని సమాచారం.

ఈవెంట్ కు బాలయ్య, చిరు

ఈవెంట్ కు బాలయ్య, చిరు

అయితే సినిమా ఈవెంట్ కు చిరంజీవి బాలకృష్ణ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా టాక్ అయితే వస్తుంది. ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యుల నుంచి ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు గానీ ఒక విధంగా ఆలోచిస్తే మాత్రం బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి మాత్రం తప్పకుండా రావాల్సిందే అనే తరహాలో కామెంట్స్ అయితే వినబడుతున్నాయి.

 మెగాస్టార్ రావాల్సిందే?

మెగాస్టార్ రావాల్సిందే?

ఇది టాలీవుడ్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కాబట్టి అది కూడా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతుంది కావున ఒకే కుటుంబానికి చెందిన అగ్రహీరోలు తప్పనిసరిగా హాజరు అయ్యే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి దాదాపు రామ్ చరణ్ పెద్ద సినిమాలకు సంబంధించిన ప్రతి ఈవెంట్ లో కూడా పాల్గొన్నాడు. ఇక ఇప్పుడు RRR సినిమా అంతకుమించి అనేలా ఉంటుంది కాబట్టి ఆయన తప్పకుండా వస్తాడు అని అభిమానులు అనుకుంటున్నారు.

చిరు వస్తే.. బాలయ్య కూడా

చిరు వస్తే.. బాలయ్య కూడా

రామ్ చరణ్ తరఫున మెగాస్టార్ చిరంజీవి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ తరపున తప్పకుండా నందమూరి బాలకృష్ణ కూడా రావాల్సి ఉంటుంది. నందమూరి సీనియర్ హీరోగా బాలకృష్ణ తన కొడుకు లంటూ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ప్రత్యేకంగా ఆశీర్వదిస్తే అభిమానుల్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి.

ఎలా స్పందిస్తారో..?

ఎలా స్పందిస్తారో..?

అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ మధ్యలో కొన్ని కారణాల వలన దూరం పెరిగినట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే బాలకృష్ణ చిరంజీవి తప్పనిసరిగా ఎదురుపడినప్పుడు మాత్రం చాలా స్నేహంగా మాట్లాడుకుంటారు అనేది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు రాజమౌళి RRR సినిమా ఈవెంట్ కు తప్పనిసరిగా పిలవాల్సిందే అనే ప్రస్తావన తీసుకు వస్తే ఎలా స్పందిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

Recommended Video

RRR : JR NTR VS Ram Charan Fan Wars | Akhanda Collections || Filmibeat Telugu
రాజమౌళి టెన్షన్..

రాజమౌళి టెన్షన్..

ఒక విధంగా రాజమౌళి కి ఇది టెన్షన్ అని టాక్ వస్తోంది. సాధారణంగా ఒక హీరో సినిమాకు వచ్చే అభిమానులను కంట్రోల్ చేయడం అసాధారణంగా ఉంటుంది. ఇక మెగా నందమూరి హీరోల కలిసి వస్తే ఎలా ఉంటుందో చెప్పలేము. పైగా చరణ్, తారక్ తరుపున చిరు బాలయ్య వస్తే వాతావరణం మామూలుగా ఉండదు. మరి ఈ విషయంలో రాజమౌళి ఎలాంటి ప్లానింగ్ తో ముందుకు వెళతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X