twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నోటా’ నొక్కండని చెప్పిన రాజమౌళి.. ఓటు కోసం తరలి వచ్చిన మెగా ఫ్యామిలీ!

    |

    మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయమే వారు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రామ్ చరణ్ ఓటు వేయకుండా మిస్ అయ్యారు. అందుకు కారణం అతడు ఆ సమయంలో విదేశాల్లో ఉండటమే. అయితే ఈ సారి మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడిని వెంటపెట్టుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. కాగా.. రాజమౌళి ఓటు వేసిన అనంతరం 'నోటా' గురించి ప్రస్తావించడం చర్చనీయాంశం అయింది.

    ఓటు హక్కు వినియోగించుకున్న మెగా ఫ్యామిలీ

    ఓటు హక్కు వినియోగించుకున్న మెగా ఫ్యామిలీ

    మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవి భార్య సురేఖ, కూతురు సుష్మిత, రామ్ చరణ్ భార్య ఉపాపసన కూడా ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాలని, మనకు మంచి భవిష్యత్తును ఇచ్చే నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు.

    నచ్చకపోతే నోటా నొక్కండన్న రాజమౌళి

    ఓటు వేసిన అనంతరం రాజమౌళి ట్విట్టర్ ద్వారా తమ వేలుపై ఇంక్ పడిన ఫోటోను పోస్ట్ చేశారు. ‘RRR సినిమాకు పని చేసే సగం మంది ఓటు వేసేందుకు వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇది చాలా మంచి పరిణామం. అందరూ తప్పకుండా ఓటు వేయండి... ఒక వేళ మీకు పార్టీ, అభ్యర్థి నచ్చకపోతే ‘నోటా' నొక్కి ఓటు వేయండి అంటూ రాజమౌళి సూచించారు.

    ఓటు వేసిన ఎస్.కె.ఎన్

    ‘టాక్సీవాలా' మూవీ నిర్మాత ఎస్.కె.ఎన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అభిమానులు అందరూ ఓటు వేయాలని సూచించారు.

    పరుచూరి గోపాల కృష్ణ

    ‘‘ఓటు వెయ్యండి. మీ ఓటు వ్యక్తిని కాదు ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి! మీరు ఓటు వేసిన వ్యక్తి చట్ట సభల్లో ప్రజాసమస్యల గురించి మాట్లాడాలి. మీ చూపుడు వేలిమీద చుక్క వున్నత ప్రజాస్వామ్య మార్గానికి దిక్సూచి కావాలి. వెంటనే వెళ్లి ఓటు వెయ్యండి సోదర సోదరీ మణులారా'' అని పరుచూరి గోపాల కృష్ణ ట్వీట్ చేశారు.

    అభిషేక్ బచ్చన్

    ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అందరూ పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లాలని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు.

    మంచు విష్ణు, మోహన్ బాబు

    తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మంచు విష్ణు ట్వీట్ చేశారు.

    English summary
    "Half of my unit members left to their towns and villages to exercise their vote... Good... Do Vote... If you think no party/candidate makes a difference, make use of nota.. #IndiaElections2019 #LokSabhaElections2019 #VoteForIndia" SS Rajamouli tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X