నా దేవుడిని కలిశాను.. టాక్సీవాలా నిర్మాతకు చిరంజీవి ప్రశంస
పైరసీ రక్కసిని ఎదురించి భారీ విజయాన్ని దక్కించుకొన్న టాక్సీవాలాపై ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసల కాకుండా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు అందుకొన్నది. ఈ చిత్రాన్ని నిర్మాతగా మారిన జర్నలిస్టు, పీఆర్వో ఎస్‌కేఎన్ రూపొందించిన సంగతి తెలిసిందే. టాక్సీవాలా విజయం సాధించడంతో ఎస్‌కేఎన్‌ను చిరంజీవి స్వయంగా ఆహ్వానించి అభినందనలు తెలిపారు.
చిరంజీవి ప్రశంసలు అందుకొన్న ఎస్‌కేఎన్ తన అనుభూతిని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇండియన్ సినిమా లెజెండ్, నా దేవుడు, నా స్ఫూర్తి, మెగాస్టార్ శ్రీ చిరంజీవి సార్ నన్ను, టాక్సీవాలా టీమ్‌ను అభినందించారు. అందుకు నేను థ్యాంక్స్ తెలియజేసుకొంటున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

నేను మెగా ఫ్యాన్‌గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ తర్వాత జర్నలిస్టుగా, పీఆర్‌గా పనిచేశాను. ప్రస్తుతం నిర్మాతగా మారే అవకాశం దక్కింది. సక్సెస్‌ఫుల్ నిర్మాతగా నా దేవుడు చిరంజీవిని కలుసుకొన్నాను. జీవితంలో లక్ష్యం పూర్తయింది. అందరికీ ధన్యవాదాలు అంటూ ఎస్‌కేఎన్ ట్వీట్ చేశారు.
టాక్సీవాలా చిత్రం విడుదలకు ముందే పైరసీకి గురైంది. సినిమా మొత్తం పైరసీ వెబ్‌సైట్లలో దర్శనమిచ్చింది. అయినా టాక్సీవాలా చిత్రం భారీ కలెక్షన్లను సాధించింది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది.


Click it and Unblock the Notifications











