twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవికి నేను కథ చెబితే... మైండ్ బ్లోయింగ్ అన్నారు... సినిమా రిలీజైతే పాలభిషేకాలే.. ప్రశాంత్ వర్మ

    |

    టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో రాణిస్తున్న యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. నాని నిర్మాతగా మారి రూపొందించిన అ! సినిమాకు దర్శకుడు. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా రూపొందించిన కల్కి ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అ! సినిమాకు ముందు మెగాస్టార్ చిరంజీవితో జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. అ! సినిమా ప్రారంభానికి ముందే చిరంజీవి మెప్పు పొందిన ప్రశాంత్ వర్మ చెప్పిన మాటలు ఇవే..

    చిరంజీవికి కథ చెప్పే అవకాశం

    చిరంజీవికి కథ చెప్పే అవకాశం

    అ! సినిమాకు ముందే నా వద్ద చాలా కథలు ఉన్నాయి. అ! సినిమాకు ముందు నాకు చిరంజీవికి కథ చెప్పే అవకాశం వచ్చింది. అయితే నేను ఆ సమయంలో కథలు చెప్పడానికి ప్రిపేర్‌గా లేను. అయితే ఓ నిర్మాత కథ చెప్పమని బలవంతం చేశారు. చిరంజీవికి కథ చెప్పడం జీవితంలో ఓ సారి వచ్చే అరుదైన అవకాశమని ప్రోత్సహించడంతో చిరంజీవికి కథ చెప్పడానికి వెళ్లాను.

    చిరంజీవి ఫ్యాన్‌ నుంచి కథ చెప్పే వరకు

    చిరంజీవి ఫ్యాన్‌ నుంచి కథ చెప్పే వరకు

    పాలకొల్లులో చిరంజీవి సినిమా చూడటానికి కష్టపడిన నేను ఏకంగా మెగాస్టార్‌కు సినిమా కథ చెప్పడం గొప్పగా అనిపించింది. మెగాస్టార్ నా ముందు ఉన్నారనే విషయాన్ని మరిచిపోయాను. నా స్నేహితుడికి ఎలా కథ చెప్పానో అలా చిరంజీవికి కథ చెప్పాను. కథ చెప్పడం పూర్తయిన తర్వాత బాగా చెప్పావని అభినందించారు. నేను విన్న టాప్ 5 నేరేషన్‌లో ఇది ఒకటి అని అన్నారు.

     చిరంజీవి మాటలపై అనుమానం

    చిరంజీవి మాటలపై అనుమానం

    నేను చెప్పిన కథ నిజంగా నచ్చిందా అనే అనుమానంతో మళ్లీ అడిగాను. నిజంగానే నచ్చింది అని చిరంజీవి చెప్పగానే నాలో తెలియని ఉత్సాహం కలిగింది. అంతేకాకుండా నాకు ఇప్పటి వరకు కథలు చెప్పిన వారిలో టాప్ 5లో మీరు ఒకరని ప్రశంసించడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఎందుకంటే చిరంజీవి కెరీర్‌లో వేలమంది ఇప్పటి వరకు కథలు చెప్పి ఉంటారు. అలాంటి వారిలో నేను ఒక్కడిని కావడం మరీ సొంతం కలిగింది.

     సైరా మొదలు కావడంతో

    సైరా మొదలు కావడంతో

    చిరంజీవి గారు కథలో కొన్ని మార్పులు చెప్పారు. ఆయన ఇమేజ్‌కు తగినట్టుగా కథలో మార్పులు చేసి చెప్పాను. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో సైరా సినిమా మొదలైంది. దాంతో నేను చెప్పిన కథ తెరపైకి రాలేదు. ఆ సినిమాలో చిరంజీవి గెటప్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఒకవేళ ఆ సినిమా రిలీజ్ అయితే చిరంజీవి కటౌట్‌కు పాలాభిషేకాలు చేస్తారు అని ప్రశాంత్ వర్మ చెప్పారు.

    English summary
    Megastar Chiranjeevi appreciates Director Prashanth Varma when he was narraged story before Awe. Prashant revealed this in the promotion of Kalki.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X