»   » న్యూ ఇయర్ పార్టీలో చిరంజీవి, హీరోయిన్స్ కేక..(ఫోటోలు)

న్యూ ఇయర్ పార్టీలో చిరంజీవి, హీరోయిన్స్ కేక..(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నూతన సంవత్సరం 2014 ప్రారంభాన్ని పురస్కరించుకుని సర్వత్రా వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో 'ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్' ఆధ్వర్యంలో గ్రాండ్‌గా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వహించిన పలు కల్చరల్ పోగ్రామ్స్ ఆహుతులను ఆకట్టుకున్నాయి. మాధవి లత, మానస హిమవర్ష, శృతి రెడ్డి, పరిణిధి, అవికా రావు, షామిలి అగర్వాల్, గెహ్నా వశిష్ట్, జియా, కోమల్ ఝా తదితరులు తమ పెర్పార్మెన్స్‌తో వీక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. పలువురు తెలుగు సినిమా గాయకులు పాడిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ఇంకా నిర్మాతల తమ్మారెడ్డి భరద్వాజ, కెఎస్ రామారావు, సంగీత దర్శకుడు చక్రి, బాలాదిత్య, సింగర్ కౌశల్య తదితరులు పాల్గొన్నారు. ఎఫ్ఎన్‌సిసి వేడుకలకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

చిరంజీవి

చిరంజీవి


2013 సంవత్సరం జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ...2014 సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ అందరికీ మంచి జరుగాలని ప్రసంగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.

అభిమానం

అభిమానం


సినిమాల్లో ఉన్నా...రాజకీయాల్లో ఉన్న చిరంజీవికి అభిమానులే అభిమానులు. అందుకు ఈ ఫోటోయే నిదర్శనం.

ముద్దు గుమ్మలు

ముద్దు గుమ్మలు


న్యూఇయర్ వేడుకల సందర్భంగా తమ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టడానికి వచ్చిన హాట్ అండ్ సెక్సీ ముద్దు గుమ్మలు

మాధవి లత

మాధవి లత


ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన న్యూఇయర్ వేడుకల్లో హీరోయిన్ మాధవి లత.

అదరగొట్టారు

అదరగొట్టారు


న్యూఇయర్ వేడుకల సందర్భంగా పలువురు తారలు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అదరిపోయింది. సినిమా పాటలతో పాటు పలు జానపద గీతాలకు లయబద్దంగా చేసిన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది.

కళాకారులు

కళాకారులు


సినిమా కళాకారులు పలువురు పలు సినిమా పాటలపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

హీరోయిన్లు కేక...

హీరోయిన్లు కేక...


పలు సినిమాల్లో నటించిన హీరోయిన్లు..... ‘ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్' ఆధ్వర్యంలో గ్రాండ్‌గా నిర్వహించిన వేడుకల్లో తమ పెర్ఫార్మెన్స్‌తో కేక పుట్టించారు.

హాజరైన సభ్యులు

హాజరైన సభ్యులు


‘ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్' ఆధ్వర్యంలో గ్రాండ్‌గా జరిగిన వేడుకలకు హాజరైన సభ్యులు

English summary
Film Nagar cultural center New Year Gala Celebrations held in Hyderabad. Megastar Chiranjeevi, KS Rama Rao, Actress Madhavi Latha, Tammareddy Bharadwaja, Anchor Shilpa Chakravarthy, Chakri, Singer Kousalya graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu