మెగాస్టార్ ఇంట్లో మంత్రి పువ్వాడ అజయ్... అభిమానికి కేక్ తినిపించిన చిరంజీవి.. ఘనంగా బర్త్ డే వేడుక!
మెగాస్టార్ చిరంజీవి అంటే అందరివాడు. ప్రతీ ఒక్కరు ఆయనను అభిమానిస్తూనే ఉంటారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా చిరంజీవి తమ అభిమానులను సొంతం చేసుకొన్నారు. అంతేకాకుండా కేవలం సినీ రంగానికే ఆయన పరిమితం కాలేదు.. రాజకీయ నేతల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారనే విషయం తాజాగా తెలంగాణ మంత్రి అజయ్ పువ్వాడ ఇంట్లో జరిగిన సంఘటనతో రుజువైంది. చిరంజీవి, మంత్రి అజయ్ పువ్వాడ మధ్య వ్యక్తిగత అభిమానం విషయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

సినిమాలతో బిజీగా.. రాజకీయాలకు దూరంగా
స్వయంకృషితో ఎదిగిన చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయనపై అభిమానం సినిమా రంగానికే పరిమితం కాలేదు. రాజకీయ రంగంలో కూడా చిరంజీవికి విశేషంగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం సినిమా రంగంలో బిజీగా ఉంటున్న ఆయన కాస్త రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

చిరంజీవిని గొప్పగా అభిమానిస్తానని
ఇక మంత్రి అజయ్ పువ్వాడ విషయానికి వస్తే.. చిరంజీవిని గొప్పగా అభిమానిస్తారు. ఆ విషయాన్ని ఖమ్మంలో జరిగిన శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్వయంగా మంత్రి అజయ్ వెల్లడించారు. ఇల్లందులో ఆచార్య సినిమా షూటింగ్ సందర్భంగా అతిథిగా చిరంజీవి, రాంచరణ్‌ను ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు. తన ఇంటిలో చిరంజీవి బస చేయడం చాలా గొప్ప అదృష్టమని చెప్పారు.

నేను చిరంజీవికి బిగ్ ఫ్యాన్‌ను అంటూ మంత్రి
శ్రీకారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంత్రి అజయ్ మాట్లాడుతూ ఇక చిరంజీవికి తాను గొప్ప ఫ్యాన్ అని చెప్పారు. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి సినిమాలకు క్యూలో నిలబడి చొక్కాలు చించుకొన్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా చిరంజీవిని అభిమానిస్తుంటానని ఆయన తన ప్రేమను చాటుకొన్నారు. అజయ్ మంత్రి మాటలకు చిరంజీవి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తననకు మంత్రి గారంటే ఇష్టం అని చెప్పారు.

చిరంజీవితో మంత్రి కుమారుడు నయన్ పుట్టిన రోజు
ఇక మంత్రి అజయ్ పువ్వాడ తనయుడు డాక్టర్ పువ్వాడ నయన్ పుట్టిన రోజును పురస్కరించుకొని చిరంజీవి ఇంటికి ఆయన వెళ్లారు. తన ఇంటికి వచ్చిన మంత్రి కుమారుడు నయన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చాన్ని అందించారు. మంత్రి అజయ్ కుమారుడి కోసం ప్రత్యేకంగా కేక్ తెప్పించి కటింగ్ చేయించారు. తనను అభిమానించే నయన్‌కు ప్రేమతో కేక్ తినిపించి వారి కుటుంబంతో ఉన్న అభిమానాన్ని చాటుకొన్నారు.

మంత్రి అజయ్ కుమార్ పువ్వాడ ట్వీట్
నయన్ పుట్టిన రోజు వేడుకలో చిరంజీవి పాల్గొన్న సందర్భంగా చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి అజయ్ పువ్వాడ ట్వీట్ చేశారు. నా తనయుడు Dr.పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్బంగా ప్రముఖ నటుడు, మెగాస్టార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి కలవడమైంది అని మంత్రి అజయ్ పువ్వాడ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Recommended Video

ఆచార్య సినిమా షూటింగులో
ఇక చిరంజీవి సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఆచార్య సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం సెకండ్ వేవ్ విజృంభించడంతో సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం మూడు, నాలుగు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్ వాటిని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











