రంగస్థలం విజయంలో అతడి ప్రమేయం.. నా మేనల్లుడి అదృష్టం.. చిరంజీవి!
మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు హీరోగా మారాడు. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ నేడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ అయింది. దర్శకుడు సుకుమార్, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కలయికలో ఈ చిత్రం రూపొందుతోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. చాలా రోజులుగా వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు అతడు హీరోగా నటించబోయే చిత్రం ప్రారంభమైంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

విజయాలతో దూసుకుపోతూ
మైత్రి మూవీస్ సంస్థ ఇటీవల మంచి విజయాలతో దూసుకుపోతోందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మైత్రి సంస్థ నిర్మాణంలో, సుకుమార్ సహకారంతో తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. నాకు మైత్రి మూవీస్ నిర్మాతలతో పెద్దగా పరిచయం లేదు. ఈ సంస్థలో రాంచరణ్ సినిమా చేయడం వలన వారితో అనుభందం ఏర్పడిందని చిరంజీవి అన్నారు.

అతడి ప్రమేయం కూడా ఉంది
రంగస్థలం చిత్ర విజయంలో తన శిష్యుడు బుచ్చిబాబు ప్రమేయం కూడా ఉందని సుకుమార్ నాతో చెప్పారు. దీనినిబట్టే అతడు ఎంతటి ప్రతిభావంతుడో అర్థం చేసుకోవచ్చు. బుచ్చిబాబు ఒక మంచి ప్రేమ కథని సిద్ధం చేసుకున్నాడు. ఈ కథతో వైష్ణవ్ డెబ్యూ మూవీని బుచ్చిబాబు విజయం వైపు నడిపిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అతడి ప్రమేయం కూడా ఉంది
రంగస్థలం చిత్ర విజయంలో తన శిష్యుడు బుచ్చిబాబు ప్రమేయం కూడా ఉందని సుకుమార్ నాతో చెప్పారు. దీనినిబట్టే అతడు ఎంతటి ప్రతిభావంతుడో అర్థం చేసుకోవచ్చు. బుచ్చిబాబు ఒక మంచి ప్రేమ కథని సిద్ధం చేసుకున్నాడు. ఈ కథతో వైష్ణవ్ డెబ్యూ మూవీని బుచ్చిబాబు విజయం వైపు నడిపిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అది సుకుమార్ గొప్పతనం
దర్శకుడు సుకుమార్ ఎప్పడూ గొప్ప మనసుతో ఆలోచిస్తుంటారు. ఎప్పుడూ నేను దర్శత్వం వహించడమే కాదు యువకుల్ని కూడా ప్రోత్సహించాలి అని భావిస్తుంటారు. ఆయన నిర్మాతగా మారి తన శిష్యులని దర్శకులుగా పరిచయం చేశాడని చిరు అభినందించారు. వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ప్రారంభోత్సవానికి మెగా బ్రదర్ నాగబాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ, అల్లు అరవింద్ అతిధులుగా హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











