మెగా అభిమానులు బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా తరువాత చేస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకోగలదని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు.

అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమా టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా సినిమా టీజర్ ను వదలనున్నారట. అసలైతే సంక్రాంతికే టీజర్ ను రిలీజ్ చేయాలని అనుకున్నరట. కానీ అప్పుడే వకీల్ సాబ్ టీజర్ రాబడంతో మనసు మార్చుకున్నారట. ఇక మొత్తానికి ఈ 26కు ఫిక్స్ చేసినట్లు సమాచారం.

Megastar chiranjeevi big surprise on next week

ఇక మెగాస్టార్ సెంటిమెంట్ రోజు సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిరు మరచిపోలేని తేదీలలో మే 9 ఒకటి. 1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ తరువాత 1991లో గ్యాంగ్ లీడర్ సినిమా కూడా అదే రోజున వచ్చింది. ఆ రెండు సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.ఇక చాలా కాలం తరువాత మెగాస్టార్ కన్ను మళ్ళీ ఆ డేట్ పైనే పడినట్లు తెలుస్తోంది. మే9న ఆచార్య విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X