రాణా లీడర్ కావాలి..మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు
ఎవరెస్ట్ శిఖరం వంటి తాత, ఎదురులేని హీరో అయిన చిన్నాన్న, తన తరంలో రామానాయుడు వంటి నాన్న.. ఈ ముగ్గురూ రానాకు ఆదర్శమే. ఎ.వి.ఎం. వంటి సంస్థలో చేయడం ద్వారా, తెలుగు చిత్రసీమలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పనిచేయడం ద్వారా రానా 'లీడర్'గా పరిచయం కావడం ఆనందకరం. సమకాలీన రాజకీయాల మీద తీసిన సినిమా కావడం వల్ల 'లీడర్' తప్పకుండా హిట్టవుతాడు'' అని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.మారియట్ హోటల్‌లో జరిగిన 'లీడర్' ఆడియో వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక ఎ.వి.యం. ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న 174వ చిత్రం 'లీడర్' ద్వారా రానా హీరోగా పరిచయమవుతు న్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం, వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం సమకూర్చిన ఈ చిత్రం ఆడియో క్యాసెట్లు, సీడీలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. ఆడియో సీడీలను నిర్మాత ఎం. శరవణన్, క్యాసెట్లను చిరంజీవి విడుదల చేశారు.అనంతరం మాట్లాడుతూ... తనకు రామానాయుడి కుటుంబంతో తనకు చక్కటి అనుబంధం ఉందనీ, ఆయన మనవడు రానా 'లీడర్' అనిపించుకోవాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాననీ చిరంజీవి ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











