twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Acharya: లేడి డూప్ ఫైటర్ కు చిరంజీవి నుంచి సహాయం.. ఏం జరిగిందంటే?

    |

    టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్టార్ ఇమేజ్ ఎంత ఉన్నా కూడా చాలా ఒదిగి ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన తన సన్నిహితులకు ఎప్పుడూ కూడా భరోసా ఇస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా వారికి అండగా సహాయం చేసేందుకు కూడా ముందుకు వస్తారు. ఇక ప్రాణాపాయ స్థితిలో ఉండే వారి కోసం కూడా మెగాస్టార్ అన్ని విధాలుగా హెల్ప్ చేయడానికి రెడీ అవుతుంటారు.

    రీసెంట్ గా ఆచార్య సినిమా కోసం వర్క్ చేసిన ఒక లేడీ డూబ్ ఫైటర్ కోసం కూడా మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్ నుంచి అత్యధిక వేగంగా సహాయం పొందినట్లుగా ఆ మహిళ తెలియజేశారు. తన భర్త బిడ్డ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి నుంచి పొందిన సహాయం గురించి వివరణ ఆమె ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

    కోవిడ్ సమయంలో..

    కోవిడ్ సమయంలో..

    మెగాస్టార్ చిరంజీవి మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన ఆక్సిజన్ అందించే విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. వారికి తోడు అభిమానులు కూడా అండగా నిలిచారు. ఆక్సిజన్ అందక చాలామంది జనాలు చనిపోతున్నారు అని తెలియడంతో మెగాస్టార్ వారికి వీలైనంత త్వరగా ఆక్సిజన్ సిలిండర్స్ అందించి ప్రతి జిల్లాలో ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

    లేడీ డూబ్ ఫైటర్ కోసం..

    లేడీ డూబ్ ఫైటర్ కోసం..

    మెగాస్టార్ చాలా సందర్భాల్లో కూడా పేదవారికి అండగా నిలిచారు. అంతేకాకుండా చిత్ర పరిశ్రమలో ఎవరు కష్టాల్లో ఉన్నట్లు వారికి తెలిసినా కూడా ఆయన మొదటి సహాయంగా ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటారు. ఇటీవల వల్లిక అనే మరొక లేడీ డూబ్ ఫైటర్ కోసం కూడా మెగాస్టార్ చిరంజీవి నుంచి సహాయం అందింది. దీంతో ఆమె ప్రత్యేకంగా తను పొందిన సహాయం గురించి వీడియో బైట్ ద్వారా తెలియజేశారు.

    హార్డ్ వర్క్ చేసే మహిళ

    హార్డ్ వర్క్ చేసే మహిళ

    హీరోయిన్స్ కు ఎక్కువగా డూబ్ ఫైటట్ వర్క్ చేసే వారిలో వల్లిక ఒకరు. రీసెంట్ ఆచార్య సినిమాల్లో కూడా ఆమె కాజల్ అగర్వాల్ కు డూబ్ గా యాక్షన్ సీన్ లో నటించారు. రామ్ లక్ష్మణ్ పని చేసే ప్రతి సినిమాలో కూడా ఆమె చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అదే తరహాలో ఆచార్య సినిమాకు కూడా పని చేసినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమె పని తనాన్ని మెచ్చుకున్నట్లు సమాచారం.

    వెంటనే స్పంసించిన మెగా టీమ్

    వెంటనే స్పంసించిన మెగా టీమ్

    అయితే రీసెంట్ గా ఒక పాపకు జన్మనిచ్చిన వల్లిక రక్తం తక్కువగా ఉండడంతో కొంత అనారోగ్యానికి గురయ్యింది. అయితే ఆమె భర్త వెంటనే మెగాస్టార్ చిరంజీవి మేనేజర్ కి ఫోన్ చేయడంతో వారు వేగంగా స్పందించారు. బ్లడ్ బ్యాంక్ నుంచి కొద్దిసేపటికే రక్తం అందించేలా చర్యలు తీసుకున్నారు. శాంపిల్స్ తీసుకొని వెంటనే స్పందించిన విధానం తమ ప్రాణాలను కాపాడింది అని తన భర్తతో కలిసి వల్లిక వివరణ ఇచ్చింది.

    మెగాస్టార్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు

    మెగాస్టార్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు

    ఈరోజు తాము ఇంత హ్యాపీగా ప్రాణాలతో ఉన్నామంటే అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని తెలియజేశారు. అందుకే మెగాస్టార్ గారికి అలాగే మేనేజర్లకు సహాయం చేసిన వైద్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అని వీడియో బైట్ లో వివరణ ఇచ్చారు.

    English summary
    Megastar chiranjeevi blood bank helps acharya doob fighter..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X