»   » రామ్ చరణ్ బర్త్‌డేకు అదే పెద్ద గిప్టు అంటున్న చిరంజీవి

రామ్ చరణ్ బర్త్‌డేకు అదే పెద్ద గిప్టు అంటున్న చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ నెల 27న 31వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా మెగా అభిమానులంతా భారీ ఎత్తున రక్తదానం చేసేందుకు ప్లాన్ చేసారు. అభిమానుల ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ చిరంజీవికి సంబంధించిన ఓ వీడియో బైట్ రిలీజైంది.

 Chiranjeevi byte about Mega blood donation

ఈ వీడియో బైట్ లో చిరంజీవి మాట్లాడుతూ..... 'రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా గ్లోబల్ మెగా బ్లడ్ డొనేషన్ ఈవెంటును నిర్వహిస్తున్న నా బ్లడ్ బ్రదర్స్ కు హృదయ పూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని మిగతా ప్రాంతాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు, అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఉన్న మెగా అబిమానులు ఒకే రోజున రక్తదానం చేయడం అనిర్వచనీయం, అసాధారణం, అధ్బుతం. రామ్ చరణ్ కు ఇంతకు మించిన గొప్ప గిఫ్ట్ ఏముంటుంది? రక్తం లభించక ఎవరూ చనిపోకూడదూ అనే నా ఆశయాన్ని నెరవేర్చడానికి రెండు దశాబ్దాలకుపైగా మీరు చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం దిగ్విజయం కావాలని, ఎందరికో స్పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ పేరు పేరునా మరోసారి అభినందనలు' అన్నారు.

Megastar Chiranjeevi byte about Mega blood donation on Ram cha...

Megastar Chiranjeevi byte about Mega blood donation on Ram charans birthday !!!

Posted by Chiranjeevi Charitable Trust on Friday, March 25, 2016
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu