Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ రంగాన్ని ఏలేస్తున్న ఈయన తాజాగా రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో ఓసారి సొంతంగా పార్టీ స్థాపించి.. ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచి.. ఆతర్వాత తాను ఇమడలేకపోతున్నానని చెప్పి మరీ దూరం అయ్యారు. కానీ తాజాగా ఈయన మరోసారి రాజకీయాల్లోకి వచ్చాడు. 14 ఏళ్ల తర్వాత రాజకీయాలపై స్పందించిన ఈయన.. ఎందుకు స్పందించారో కూడా చెప్పారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హీరోగా పీక్స్ లో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా 2008 ఆగస్టు 26వ తేదీన ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. సినిమాలకు దూరం అయి మరీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పిన ఈయన.. 2009 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. మొత్తం 295 స్థానాల్లో పోటీ చేయగా 18 స్థానాల్లో గెలిచారు. ముఖ్యంగా చిరంజీవి పాలకొల్లు, తిరుపతిలో పోటీ చేయగా.. తిరుపతిలో గెలిచి, పాలకొల్లులో ఓడిపోయారు. ఆ తర్వాత అంటే 2011లో తాను రాజకీయాల్లో ఇమడలేనని చెబుతూ.. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.

అయితే ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలపై స్పందించలేదు. కానీ 14 ఏళ్ల తర్వాత తొలిసారి రాజకీయాలపై స్పందించారు. ముఖ్యంగా తాను ఓ పార్టీకీ సపోర్ట్ చేస్తున్నట్లు వివరించడమే కాకుండా.. వారికే ఓట్లు వేసి గెలిపించాలని కూకాడ కోరారు. అయితే ఇన్నేళ్ల తర్వాత తాను మళ్లీ రాజకీయాల గురించి మాట్లాడడానికి కారణం తన తమ్ముడు పవన్ కల్యాణ్ అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఏకం అయిన కూటమికి తాను మద్దతు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఏపీలో గెలిస్తే రాష్ట్రం కచ్చితంగా అభివృద్ధి చెందుతున్న నమ్మకం ఉందని... మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. అందుకోసమే అనకాపల్లి ఓటర్లు తమ కూటమి ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ కు ఓట్లు వేసి గెలిపించుకోవాలని చెప్పారు. అలాగే పెందుర్తి శాసన సభ స్థానం నుంచి కూటమి తరఫున పోటీ చేస్తున్న ఎమమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల బాబుకు ఓటు వేసి గెలిపించుకోవాలని సూచించారు. వారిద్దరినీ పక్కన కూర్చోబెట్టుకుని మరీ వీడియో చేసిన చిరంజీవి.. కూటమిని గెలిపించాలన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మీరు కూడా ఓసారి చూసేయండి.


Click it and Unblock the Notifications











