twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జనసేన పార్టీకి మద్దతు.. పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీపై స్పందించిన చిరంజీవి

    |

    మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్భంగా బుధవారం రోజు గ్రాండ్ గా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నిర్వహించిన స్పెషల్ ప్రెస్ మీట్ లో పలు రాజకీయ అంశాలపై రియాక్ట్ కావడం వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలపై కూడా మెగాస్టార్ చాలా సున్నితంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

    రాజకీయాలకు దూరంగా

    రాజకీయాలకు దూరంగా

    మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత మళ్లీ దాన్ని కాంగ్రెస్ లోకి విలీనం చేసి ఆ తర్వాత మరి కొన్నాళ్లకు టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన కేవలం సినిమాలను చేస్తూ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు.

    మెగాస్టార్ స్టార్, పవర్ స్టార్

    మెగాస్టార్ స్టార్, పవర్ స్టార్

    ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడికి మద్దతు ఇస్తున్నట్లుగా పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. కానీ పవన్ ను మాత్రం మెగాస్టార్ ఎప్పుడు కూడా కలుసుకుంటూనే ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ గా అలాగే సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ లలో కూడా మెగాస్టార్ పవర్ స్టార్ కలుసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

    పవన్ గురించి తెలుసు

    పవన్ గురించి తెలుసు

    ఇక గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ లో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయాలపై కూడా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీతో కూడిన నాయకుడు అని నిబద్ధత ఉన్న వ్యక్తి అంటూ చిన్నప్పటినుంచి కూడా పవన్ గురించి తనకు తెలుసు అని అన్నారు. ముఖ్యంగా పవన్ లాంటి నాయకులు ఈ రాష్ట్రాన్ని పాలించే రోజు రావాలి అని ప్రజలు అవకాశం ఇవ్వాలి అని కోరుకుంటున్నట్లు చెప్పారు.

    మంచి నాయకుడు అవుతాడు

    మంచి నాయకుడు అవుతాడు

    అలాగే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి తాను మద్దతు ఇస్తానో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన తమ్ముడు అంటూ మెగాస్టార్ చాలా ఆప్యాయంగా తెలియజేశారు. అలాగే పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు అవుతాడు అని నమ్మకం ఉంది అని భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి రాష్ట్రాన్ని ఏలే నాయకుడు కూడా కావచ్చు అని మెగాస్టార్ తనదైన శైలిలో పాజిటివ్ గా స్పందించారు.

    గతంలోనే రూమర్స్..

    గతంలోనే రూమర్స్..

    ఇక గతంలో అయితే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి కలవబోతున్నారు అని జనసేన పార్టీలో మెగాస్టార్ చిరంజీవి కీలకంగా వ్యవహరించబోతున్నట్లుగా కథనాలు వెలుపడ్డాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని గతంలోనే కొంతమంది జనసేన నాయకులు క్లారిటీ ఇచ్చారు కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం పవన్ కళ్యాణ్ పై చాలా పాజిటివ్ గానే రియాక్ట్ అవ్వడం మళ్ళీ చర్చకు దారి తీసింది. మరి ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఏదైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

    English summary
    Megastar chiranjeevi comments on pawan kalyan politics and his support
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X