twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గొల్లపూడి మరణం : మాది గురుశిష్యుల సంబంధం.. ఆయన ద్వారానే ఆ అవకాశం.. చిరంజీవి స్పందన

    |

    ప్రముఖ రచయిత, గొప్ప నటుడు గొల్లపూడి మారుతి రావు మరణంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో గత కొంత కాలం నుంచి చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం మృతి చెందారు. దీంతో సినీ పరిశ్రమకు చెందిన వారే కాకుండా రాజకీయ ప్రముఖులు సైతం ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, సినిమాటోగ్రఫర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కోట శ్రీనివాస రావు లాంటి వారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

    గురు శిష్యుల్లాంటి సంబంధం..

    గురు శిష్యుల్లాంటి సంబంధం..

    గొల్లపూడి మారుతిరావుతో తనకున్నది గురుశిష్య సంబంధమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన మరణం పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఆ మధ్య తన కుమారుడు పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ ఫంక్షన్‌కి నేను వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. ఆయనకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. గురు శిష్యుల్లాంటి సంబంధం.

    అలా పరిచయం.. క్లాసులు తీసుకునేవాడు..

    అలా పరిచయం.. క్లాసులు తీసుకునేవాడు..

    నేను 1979లో ఐలవ్‌యూ అనే సినిమా చేసినప్పుడు, ఆ సినిమా ప్రొడ్యూసర్ భావన్నా రాయణగారు నాకు గొల్లపూడి మారుతిరావుగారిని పరిచయం చేశారు. అప్పటికే గొల్లపూడి మారుతిరావుగారు చాలా పెద్ద రచయిత, నాటక రచయిత, జర్నలిస్టుగా కూడా పనిచేశారు. సాహిత్య పరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికుడు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకో అని నన్ను పంపించారు. ఆ రకంగా గొల్లపూడి మారుతిరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాస్‌లు తీసుకున్నారు. ఈ విధంగా ఆయన నాకు గురువనే చెప్పగలను. ఆ సరదా పరిచయం మాకు స్నేహంగా మారింది.

    ఆయన ద్వారానే ఆ అవకాశం..

    ఆయన ద్వారానే ఆ అవకాశం..

    ఖాళీ ఉన్నప్పుడల్లా నేను టి.నగర్‌లో వాళ్ళింటికి వెళ్తుండేవాడిని. ఆయన నాతో ఎన్నో సాహిత్య పరమైన విషయాలు చెప్పేవారు. తన గతం గురించి, గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే చాలా ఆసక్తికరంగా వింటుండేవాడిని. నాకుకూడా సాహిత్యం పట్ల, గొప్ప రచయితల గురించి తెలుసుకునే అవకాశం ఆయన ద్వారానే కలిగింది. 1982లో కోడిరామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో క‌ృష్ణయ్య' సినిమా తీయాలనుకున్నప్పుడు ఆకథలో ఈ పాత్రని గొల్లపూడి మారుతిరావుగారు వేస్తే బాగుంటుందని అనగానే నాకు కూడా అది మంచి చాయిస్ అనిపించింది.

    సినీ ప్రపంచానికే తీరని లోటు..

    సినీ ప్రపంచానికే తీరని లోటు..

    ఒకరకమైన శాడిజం భర్త, కామెడీగా ఉండే క్యారెక్టర్ . ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్బుతం గా నటించి అందరి మన్ననలు పొందారు, ఆ విధంగా నా సహనటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి నాకు. ఆ తర్వాతనుంచి ‘ఆలయ శిఖరం', ‘అభిలాష', ‘ఛాలెంజ్' లాంటి వరుసగా ఎన్నో సినిమాలు నాతో కలిసి నటించారు. మేం ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్నాశాలి, సాహిత్యవేత్త, గొప్ప నటుడు, నాటక రచయిత అయిన గొల్లపూడి మారుతిరావుగారు దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాదు, యావత్తు సినీ ప్రపంచానికే తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అన్నారు.

    English summary
    Tollywood senior actor Gollapudi Maruthi Rao passed away in chennai hospital. He died with Cardiac Attack. KCR Annapurna, Paruchuri Gopalkrishna, Mahesh Babu, Anil Ravipudi, Sudheer Babu, Allari Naresh, Varun Tej, Kajal Aggerwal, Talasani Srinivas Yadav, Nithin, Kona Venkat Etc Celebraties gave condolence to his death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X