twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హనుమంతరావు మృతిపై చిరంజీవి ఉద్వేగం.. భోరుమని విలపించిన కవిత..

    By Rajababu
    |

    ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు ఇకలేరన్న వార్తతో సీనీ ప్రముఖులు, అభిమానులు తల్లడిల్లిపోయారు. గతకొద్దికాలంగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. హనుమంతరావు భౌతికకాయాన్ని సందర్శించిన ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. హనుమంతరావుతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ పలువురు ఉద్వేగానికి లోనయ్యారు. హనుమంతరావు మృతికి చిరంజీవికి తీవ్ర సంతాపం తెలిపారు. సినీ నటి కవిత భోరున విలపించింది.

    Recommended Video

    శోకసంద్రంలో టాలీవుడ్
    మృతివార్తతో కలత చెందాను

    మృతివార్తతో కలత చెందాను

    గుండు హనుమంతరావు మృతికి సంతాపం ప్రకటిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘తెలుగు చిత్రసీమలో ప్రతి హాస్యనటుడిదీ ఒక్కో శైలి. అలానే గుండు హనుమంతరావుగారు సైతం తనదైన శైలితో కోట్లాది తెలుగు ప్రేక్షకులకు మూడు దశాబ్దాలుగా వినోదాన్ని అందిస్తూ వచ్చారు. ఆ మధ్య ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసి కలత చెందాను. నా వంతు సాయం అందించాను' అని పేర్కొన్నారు.

     మంచి నటుడిని కోల్పోయాం

    మంచి నటుడిని కోల్పోయాం

    పరిపూర్ణ ఆరోగ్యంతో ఆయన తిరిగి సినిమాల్లో నటిస్తారని భావించాను. కానీ ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. గుండు హనుమంతరావు గారి మృతితో తెలుగు సినిమా రంగం మంచి నటుడినే కాదు, చక్కని మనిషినీ కోల్పోయింది. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి తన సంతాప ప్రకటనలో తెలిపారు.

     సినీ ప్రముఖుల పరామర్శ

    సినీ ప్రముఖుల పరామర్శ

    హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్‌లోని గుండు హనుమంతరావు నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. పలువురు ఆయన లేని లోటు తలచుకొని ఉద్వేగానికి లోనయ్యారు.

    భోరున విలపించిన కవిత

    భోరున విలపించిన కవిత

    హనుమంతరావు భౌతికకాయంపై పుష్ఫగుచ్చాన్ని సినీ నటి కవిత నివాళులర్పించారు. ఆ తర్వాత భౌతికకాయం వద్ద భోరున విలపించారు. కవిత విలపించడం చూసి అక్కడ ఉన్నవారు కంటతడి పెట్టారు.

     ఆత్మకు శాంతి కలుగాలని

    ఆత్మకు శాంతి కలుగాలని

    అనంతరం హనుమంతరావుతో ఉన్న అనుబంధాన్ని కవిత గుర్తు చేసుకొన్నారు. హనుమంతరావు మంచి నటుడు. చాలా ఏళ్లుగా ఆయనతో వ్యక్తిగత పరిచయం ఉంది అని కవిత తెలిపారు. ఏ లోకాన ఉన్నా హనుమంతరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

    English summary
    Popular Telugu cinema comedian Gundu Hanumantha Rao passed away in the wee hours of Monday in Hyderabad. He was 61. Hanumantha Rao was ailing for some time with kidney problem and passed away at his home at 3 a.m., according to family sources. He is survived by a son. His wife predeceased him. In this sorrow moments, Megastar Chiranjeevi condoles to Hanumantha Rao death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X