కిచెన్‌లో దూరి నాగ్‌కు చికెన్ వండిన చిరు.. కింగ్, మెగాస్టార్ ఫోటో వైరల్
కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ సినిమా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. సినిమా షూటింగులు, రిలీజ్‌లు వాయిదా పడటంతో టాలీవుడ్ పరిశ్రమతోపాటు అన్ని సినిమా పరిశ్రమలు కుదేల్ అయ్యాయి. లాక్‌డౌన్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ జోరందుకొన్నది. ఈ క్రమంలో కింగ్ నాగార్జున ఏప్రిల్ 2 తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమాకు ప్రమోషన్ అయ్యేలా తమ బంధాన్ని గుర్తు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

నాగార్జున, మెగాస్టార్ అనుబంధం
సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మధ్య ఉంటే అనుబంధం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సమయం చిక్కినప్పుడల్లా వారి మధ్య ప్రేమను బహిరంగంగా పంచుకొంటారు. వారి కుటుంబాల మధ్య మంచి స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి.

బిగ్‌బాస్ వేదికపై స్టార్ హీరోల హంగామా
ఇక కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు ముఖ్య అతిథిగా రెండుసార్లు హాజరయ్యారు. నాగ్‌పై ఉండే ప్రత్యేకమైన అభిమానమే బిగ్‌బాస్ ఫైనల్ ఈవెంట్‌కు రావడానికి కారణం అని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఆ వేదికపై ఆ ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉంటే అభిమానం స్పష్టమైంది.

భారీగా ప్రమోషన్స్‌తో నాగార్జున
ఇదిలా ఉండగా, వైల్డ్ డాగ్ సినిమా తర్వాత కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో సిద్ధమయ్యారు. గత కొద్దికాలంగా మంచి హిట్‌ను సొంతం చేసుకోవాలని నాగ్ వేచి చూస్తున్నారు. భావోద్వేగమైన కంటెంట్‌తో వైల్డ్ డాగ్‌తో హిట్ సాధించేందుకు ప్రమోషన్ కార్యక్రమాలను మంచి జోష్‌తో ప్లాన్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నాగ్ ఓ రేంజ్‌లో ప్రచారం చేయడం ప్రేక్షకులను ఆకర్షించింది.

కిచెన్‌లో దూరి నాగ్‌కు చికెన్ వండిన చిరు
వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్‌కు ముందు చిరంజీవి, నాగార్జున సందడి చేశారు. చిరంజీవి నివాసానికి వెళ్లిన నాగ్.. వంటగదిలో దూరి హంగామా చేశారు. ఈ సందర్భంగా నాగార్జున కోసం చిరంజీవి మంచి విందును సిద్ధం చేశారు. నాగ్ కోసం చికెన్ కబాబ్ చేసి తమ సంతోషాన్ని పంచుకొన్నారు. వంటగదిలో ఉండి చికెన్ ముక్కలతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వైల్డ్ డాగ్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: నాగార్జున అక్కినేని, దియా మిర్జా, సాయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీరెజా, అప్పాజీ అంబరిషా, అవిజత్ దత్త తదితరులు
కథ, డైరెక్టర్: అషిషోర్ సాల్మన్
నిర్మాత: ఎస్ నిరంజన్ రెడ్డి, కే అన్వేష్ రెడ్డి
సినిమాటోగ్రఫి: షానీల్ డియో
బ్యానర్: మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2021-04-02


Click it and Unblock the Notifications











