అల్లు అరవింద్ కు మెగా కౌంటర్.? సున్నితంగా చురకలు!

పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ స్పీచ్ ఆసక్తికరంగా మారింది. తెలుగు చలన చిత్ర పరిశ్రలో అంతోఇంతో పెద్దదిక్కుగా ఉండి అన్నీ బాగోగులను చూసుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో టికెట్ రెట్లు, ఇండస్ట్రీ వ్యక్తులకు వచ్చిన సమస్యలను పరిష్కరిండంలో చిరు ముందున్న విషయం తెలిసిందే. తాను ముందుండి సాయం చేయడమే కాకుండా నలుగురితో సేవలందించారు. ఇలా అన్నీ విషయాల్లో మెగాస్టార్ ఆయన పెద్ద మనస్సును చాటుకుంటున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులనూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఏ ఎక్కరి పట్ల కూడా ఆయన దురుసు మాటలు, పరోక్షంగా కూడా కించెత్తి మాట అనలేదు. ఎవరి మనస్సు నొప్పించకూడదనేది ఆయన నెర్పిన క్రమశిక్షణ. అదే బాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పయనిస్తున్నారు. అందరి మన్ననలు పొందుతున్నారు.

అయినా.. మెగా ఫ్యామిలీని ఉద్దేశించి సొంత వ్యక్తులే మాట్లాడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఓ ఈవెంట్ లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై ప్రయత్నంగానో.. అప్రయత్నంగానో నోరుజారిన విషయం తెలిసిందే. ఆ విషయంలో తిరిగి ఎలాంటి ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వలేదు. ఓ ప్రెస్ మీట్ లో ప్రశ్న ఎదురైనా దాటవేశారే కానీ.. తన మనస్సులో ఏమీ లేదని.. ఉద్దేశపూర్వంగా అనేదని మాత్రం ఒప్పుకోలేదు. దీంతో మెగా వర్సెస్ అల్లు వార్ నిజమేనని కొత్తగా వార్తలు వస్తున్నాయి.

Megastar Chiranjeevi Counter to Allu Aravind indirectly in Laila movie event

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అరవింద్ మాటలకు సున్నితంగానే బదులిచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమాపై అరవింద్ మాటలకు సుతిమెత్తగా చురకలు అటించారు. నిన్నటి విశ్వక్ సేన్ లైలా మూవీ ఈవెంట్ లో చిరు స్పీచ్ ఆసక్తికరంగా మారింది. అల్లు అరవింద్ విషయమై పరోక్షంగా ఇలా స్పందించారు. ఇండస్ట్రీలో అందరూ సమానులేనని, కలిసి మెలిసి ఉండాలని కోరారు. మెగా ఫ్యామిలీ దేంట్లోనూ తక్కువ కాదు కదా.. ఓవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు చరణ్ దూసుకెళ్తుూనే ఉన్నారన్నారు. అలాగే అల్లు అర్జున్ సినిమా 'పుష్ప2' బ్రహ్మండమైన సినిమాగా నిలిచింది. ఇది మంచి విషయం. ఓ సినిమా ఆడొచ్చు.. ఆడకపోవచ్చు.. వ్యక్తులు కలిసి ఉండటం ముఖ్యమన్నారు.

ఏదేమైనా ఇండస్ట్రీలో ఎవరి సినిమా ఆడిందంటే తప్పకుండా మద్దుతు తెలపాలని, ఆదరించాలని కోరారు. సినీ కార్మికులు, టెక్నీషియన్లకు హిట్ సినిమాలతో ఎంతో లాభం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరి సినిమా హిట్ చేసేందుకే ప్రయత్నించాలన్నారు. ఇక ఇండస్ట్రీలో ఎలాంటి కాంపౌండ్స్ లేవన్నారు. నందమూరి, మెగా, అక్కినేని కాంపౌండ్స్ లేవన్నారు. అలాంటి కాంపౌండ్స్ వేయొద్దన్నారు. ఇండస్ట్రీలో ఉన్న వారిమంతా కలిసే ఉంటామని లేనిపోని వార్ పెట్టొద్దన్నారు. రీసెంట్ గా విశ్వక్ కూడా చాలా తెలివిగా బదులిచ్చారని గుర్తు చేశారు. ఇండస్ట్రీకి ఒక్కటే కాంపౌండ్ ఉందని, అందులో అందరూ కలిసి ఉండాలని ఆశించారు. ఇక విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'లైలా' ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతోంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాహు గరపాటి నిర్మాతగా వ్యవహరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X