twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాతో సినిమా చేస్తూ ఆమెను ప్రేమించాడు: కోడి రామకృష్ణ గురించి చిరంజీవి ఎమోషనల్!

    |

    శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. రామకృష్ణ మరణం వార్త తెలిసి పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు.

    మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి కోడి రామకృష్ణ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో మా అనుబంధం మొదలైంది. ఆ సినిమా 500 రోజులకుపైగా ఆడి మాకు అరుదైన రికార్డును తీసుకొచ్చిందని గుర్తు చేసుకున్నారు.

    వైవిద్యమైన సినిమాలు చేసే దర్శకడు

    వైవిద్యమైన సినిమాలు చేసే దర్శకడు

    కోడి రామకృష్ణ తీసే ఒక్కో సినిమా వైవిధ్యంగా ఉంటుంది. డిఫరెంట్ జోనర్ సినిమాలు చేసేవారు. జేమ్స్ బాండ్ సినిమాలు, రెవెల్యూషనరీ సినిమాలు, ఫ్యామిలీ డ్రామాలు, గ్రాఫిక్స్ ఫిల్మ్స్, దైవానికి సంబంధించిన సినిమాలు చేసి మెప్పించారు.

    దాసరికి తర్వాత ఆయనే

    దాసరికి తర్వాత ఆయనే

    దాసరి నారాయణరావు లాంటి వారి తర్వాత వందకు పైగా సినిమాలు చేసిన ఘనత దక్కించుకుని దాసరి గారికి తగిన శిష్యుడు అనిపించుకున్నారు. ఆయన తలకు రుమాలు కట్టినప్పటి నుంచి దాన్ని తీసే వరకు పని తప్ప వేరే ధ్యాస ఉండదు. అంతటి కష్టపడే మనిషి కాబట్టే ఆయన అన్ని సినిమాలు చేయగలిగారు.

    హిందీలో ఆయన సినిమానే...

    హిందీలో ఆయన సినిమానే...

    నేను హిందీలో ప్రవేశించాలి అనుకున్నపుడు ఏదైనా తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేయాలన్నాం. కోడి రామకృష్ణగారి దర్శకత్వంలో వచ్చిన ‘అంకుశం'... ‘ప్రతి బంధ్' గా హిందీలో చేయడం జరిగింది. ఆయనతో సినిమా ఫ్రయాణం ఒక నైస్ ఎక్స్ పీరియన్స్.

    ఆయన పర్సనల్ లవ్ స్టోరీ కూడా..

    ఆయన పర్సనల్ లవ్ స్టోరీ కూడా..

    ఆయన పర్సనల్‌ విషయాలు కూడా నాతో షేర్ చేసుకునేవారు. పెళ్లికాని యువకుడిగా ఉన్నపుడు తన లవ్ స్టోరీని నాకు చెప్పి సలహాలు, సపోర్ట్ కావాలని అడిగేవారు. ఆయన పద్మ గారిని లవ్ చేస్తున్నపుడు ‘ఆలయ శిఖరం' సినిమా చేస్తున్నాం. ఆ సమయంలో నాకు సన్నిహితంగా మారిపోయారు.

    కాన్ఫిడెన్స్ తగ్గలేదు

    కాన్ఫిడెన్స్ తగ్గలేదు

    ఈ మధ్య కాలంలో ఆయన్ను పలు ఫంక్షన్లో చూసినపుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కనిపించారు. అయినా ఆయనలో ఆ మనోధైర్యం, కాన్ఫిడెన్స్ ఏ మాత్రం తగ్గలేదు. సంపేద్దాం గురువుగారు అనే ఊతపతం వాడేవారు. నా మనసుకు అత్యంత దగ్గరైన వ్యక్తి కోడి రామకృష్ణ ఇక మనకు లేరు అనే వాస్తవాన్ని జీర్ణించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను... అని చిరంజీవి అన్నారు.

    English summary
    Megastar Chiranjeevi Deep Condolences to Director Kodi Ramakrishna. The entire Telugu film fraternity is mourning the death of veteran director Kodi Ramakrishna. His last rites will be performed at the Mahaprasthanam burial ground in Hyderabad at 12 pm tomorrow.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X