twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sirivennala హాస్పిటల్‌కి వెళ్ళే రోజే మాట్లాడారు.. అక్కడికి కలిసివెళ్దాం అనుకున్నాం.. చిరంజీవి దిగ్భ్రాంతి

    |

    టాలీవుడ్ సినీ పరిశ్రమను వరుస విషాదాలు పట్టి కుదిపేస్తున్నాయి. రెండు రోజుల క్రితం శివ శంకర్ మాస్టర్ కన్నుమూయడంతో టాలీవుడ్ యావత్తు విషాదంలో మునిగిపోగా ఇప్పుడు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా కన్ను మూయడం టాలీవుడ్ మొత్తానికి ఒక షాక్ అనే చెప్పాలి. ఆయన మరణం మీద సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తూ ఉండగా మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ స్పందన తెలియచేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    తీవ్ర దిగ్భ్రాంతి

    సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం గురించి చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి వెళుతున్న సమయంలో నాతో మాట్లాడారన్న ఆయన, తన ఆరోగ్య పరిస్థితి బాలేదని వివరించడంతో అంతగా బాగోనప్పుడు మద్రాసులో ఒక మంచి హాస్పిటల్లో ఉందని అక్కడ జాయిన్ అవ్వదురు గాని అని అన్నానని పేర్కొన్నారు. అప్పుడు ఆయన మిత్రమా ఈ రోజు ఇక్కడ జాయిన్ అవుతాను నెలాఖరులోపు వచ్చేస్తాను, నువ్వు అన్నట్టుగానే అప్పటికి ఉపశమనం రాకపోతే, ఖచ్చితంగా మనిద్దరం కలిసి అక్కడికి వెళ్దాం అన్నారనీ వెల్లడించారు.

    ఏమీ జరగదు అనుకున్నాను

    ఏమీ జరగదు అనుకున్నాను

    అలా వచ్చేస్తానని వెళ్ళిన మనిషి ఈ విధంగా జీవం లేకుండా వస్తారు అనేది ఊహించ లేకపోయాననీ, ఇది చాలా బాధాకరమైన విషయం అని ఆయన అన్నారు. అన్ని రకాల మెరుగైన వైద్యం, అందివ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయనకు ఫోన్ చేస్తే ఎంతో హుషారుగా మాట్లాడారనీ, అంత ఉత్సాహంగా దాదాపు 20 నిముషాల పాటు మాట్లాడితే ఖచ్చితంగా ఏమీ జరగదు అని నేను అనుకున్నాను అని ఆ సమయంలో వారి కుమార్తెతో కూడా మాట్లాడాను మీతో మాట్లాడాక నాన్నగారు చాలా ఉత్సాహంగా ఉన్నారని ఆమె నాకు చెప్పారని మెగాస్టార్ అన్నారు. నన్ను సీతారామశాస్త్రి గారి కుటుంబంలో వాళ్ళు ఎంతగా అభిమానిస్తారనే విషయాన్ని కూడా ఆమె చెబితే ఆనందంగా అనిపించింది అని ఆయన పేర్కొన్నారు.

    మిత్రమా అంటూ

    మిత్రమా అంటూ

    ఇక ఇద్దరూ ఒకటే వయసు వాళ్ళం కావడంతో ఎప్పుడూ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మిత్రమా మిత్రమా అని అంటూ ఉండేవారన్న ఆయన ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడతారనీ అన్నారు.. ఆయన తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించారనీ, వేటూరిగారి తర్వాత అంత గొప్ప సాహిత్య విలువలను ఈ తరానికి అందించిన గొప్ప రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అని అన్నారు. ఆయన భాషను అర్థం చేసుకోవడానికి కూడా మనకున్న పరిజ్ఞానం సరిపోదు అంతటి మేధావి ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు తన కెరియర్లో అందుకున్న ఆయనకు 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందివ్వగా ఆ రోజున నేను వ్యక్తిగతంగా ఆయన ఇంట్లో చాలా సేపు గడిపాననీ మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు.

    గుండెంతా బరువెక్కి పోతోంది


    సిరివెన్నెలను కోల్పోతే సొంత బంధువుని కోల్పోయినట్లుగా చాలా దగ్గరి ఆత్మీయుడిని కోల్పోయినట్టే అనిపిస్తోంది. గుండె తరుక్కుపోతోంది, గుండెంతా బరువెక్కి పోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరనీ మెగాస్టార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మందిని శోక సముద్రంలో ముంచి దూరమైపోయిన ఆయన నిజంగా మనందరికీ, ఈ సాహిత్య లోకమంతటికి అన్యాయం చేశారని, ముఖ్యంగా మా లాంటి మిత్రులకు అన్యాయం చేసి వెళ్ళిపోయారనీ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.

    అందరినీ వదిలి తరలి వెళ్ళి పోయారు

    అందరినీ వదిలి తరలి వెళ్ళి పోయారు

    ముఖ్యంగా నాకు అత్యంత ఇష్టమైన రుద్రవీణ సినిమాలోని తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం అనే పాటలోలాగా ఆయనే మన అందరినీ వదిలి తరలి వెళ్ళి పోయారనీ మెగాస్టార్ పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇలా అర్థాంతరంగా వెళ్లిపోవడం చిత్ర పరిశ్రమకు ఎవరూ పూరించలేని లోటు. భౌతికంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి దూరమయ్యారు కానీ తన పాటలతో ఇంకా ఆయన బతికే ఉన్నారని, తన పాట బతికున్నంతకాలం సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా బతికే ఉంటారనీ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

    Recommended Video

    Choreographer Shiva Shankar Master శివైక్యం... ప్రముఖుల సంతాపం!! || Filmibeat Telugu
    మళ్లీ మనకు తారసపడడం కష్టమే

    మళ్లీ మనకు తారసపడడం కష్టమే

    ఆయన సాహిత్యంలో శ్రీశ్రీ గారి పదును కనపడుతుంది, ఈ సమాజాన్ని మేలుకొలిపే విధంగా ఒక శక్తి ఉంటుంది, ఈ సమాజంలో తప్పు ఎత్తి చూపే విధంగా ఆయన సాహిత్యం ఉంటుంది, ఈ సమాజానికి పట్టిన కుళ్ళు కడిగిపారేసే విధంగా ఉంటుంది. అంత పవర్ ఆయన సాహిత్యంలోనే కాదు ఆయన మాటల్లోనే కాదు, ఆయన కలంలోనే కాదు ఆయన మనస్తత్వం కూడా దాదాపు అలాగే ఉంటుందని మెగాస్టార్ పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప కవి మళ్లీ మనకు తారసపడడం కష్టమే. ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాననీ చిరంజీవి ఆకాంక్షించారు. ఆయనను ఆ సరస్వతీ దేవి తన ఒడిన చేర్చుకోవాలని అభిలషిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాననీ అంటూ చిరంజీవి పేర్కొన్నారు.

    English summary
    megastar Chiranjeevi deep condolences on sirivennela sitarama Sastry death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X