సీఎం రేవంత్ తో భేటీకి చిరంజీవి దూరం? కారణం ఏమిటంటే?

Tollywood: తెలుగు చిత్ర సీమలో గత వారం రోజులుగా గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రధానంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రభావం టాలీవుడ్ పై తీవ్రంగా పడింది. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుని. టాలీవుడ్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలనీ, టాలీవుడ్ సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సిని ప్రముఖులు భేటీ కానున్నారు. అత్యంత కీలకమైన, ప్రాధాన్యతతో కూడిన ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి హాజరుకాకపోవడంతో ఈ విషయం చర్చనీయంగా మారింది. ఇంతకీ చిరంజీవి రాకపోవడానికి కారణమేంటి?

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రభావం టాలీవుడ్ పై గట్టిగానే పడిందని చెప్పాలి. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇకపై సినిమాలకు ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వబోమని, టికెట్ల పెంపు ఉండబోదని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. దీంతో టాలీవుడ్ సినీ, ఈ నిర్ణయంతో టాలీవుడ్లో గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. మరోవైపు.. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు భారీ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి , టాలీవుడ్ మధ్య దూరం తగ్గించాలని భావించారు.

Megastar Chiranjeevi did not attend Tollywood Celebrities to Meet Telangana CM Revanth Reddy

ఈ తరుణంలో తెలుగు చిత్ర సీమలో నెలకొన్న సమస్యలపై సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అవుతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా టాలీవుడ్ ప్రముఖులు, తెలంగాణ సీఎం సమావేశం కానున్నారు. ఈ బేటీలో హీరోలనుంచి వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, శివ బాలాజీ, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీపైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట హాజరయ్యారు.

ఇక నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చినబాబు, నిర్మాత నాగవంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, స్రవంతి రవి కిషోర్ , కె ఎల్ నారాయణ, యూవీ క్రియేషన్స్ వంశీ, భోగవల్లి ప్రసాద్ , సుధాకర్ రెడ్డి, సి.కళ్యాణ్, గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్ , కె.ఎల్ నారాయణ తదితరులు సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో హాజరయ్యారు.

అలాగే మా అసోసియేషన్ నుండి తెలంగాణ ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ నుండి కూడా పలువురు ప్రతినిధులు హాజరయ్యారు ఇక.. ప్రభుత్వం రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్, దామోదర రాజనర్సింహ‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అయితే ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవి కానీ మెగా హీరోలు రామ్ చరణ్, సాయి దుర్గ తేజ్ వంటి హీరోలు ఎవరు కూడా ఈ మీటింగ్ కు హాజరు కాకపోవడం చర్చనీయంగా మారింది. అయితే.. చిరంజీవి కావాలని సీఎం భేటీకి డుమ్మా కొట్టారా? లేదా ఇతర కారణాలతో హాజరు కాలేకపోయారా ? అనేది చర్చనీయంగా మారింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. బిజెపి నుండి మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపించే అవకాశం ఉందట, ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా ఈ భేటీకి దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే వ్యక్తిగత కారణాలవల్ల మెగాస్టార్ చిరంజీవి చెన్నై వెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడ అత్యంత సన్నిహితుల వివాహ వేడుకల్లో పాల్గొనడానికి కుటుంబ సమేతంగా వెళ్లినట్లు ఇండస్ట్రీ టాక్.

ఈ నేపథ్యంలో చిరంజీవి కావాలనే ఈ భేటీకి దూరంగా ఉన్నాడని, అల్లు అర్జున్ కు అల్లు ఫ్యామిలీకి మద్దతుగా ఉండలేకపోతున్నారంటూ పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అలాగే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ కు సంఘీభావం తెలిపినప్పటికీ దీనిపై ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏది ఏమైనాప్పటికీ.. అల్లు అర్జున్ కు మెగాస్టార్ ఫ్యామిలీ మద్దతు ఉంటుందనేది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X