మెగాస్టార్ కొత్త లుక్.. ఫోటో షూట్ చేసిన కొరటాల శివ!
Recommended Video

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శత్వంలో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు చిరు, కొరటాల శివ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. కొరటాల శివ కథతో రెడీగా ఉన్నారు. సైరా చిత్రం మరికొన్ని నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. దీనితో కొరటాల శివ తన పని ప్రారంభించేసినట్లు తెలుస్తోంది.

చిరంజీవిని ఫోటో షూట్
ఇటీవల కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవిని ఫోటో షూట్ చేసినట్లు తెలుస్తోంది. తన కథకు అనుగుణంగా ఉండే బాడీలాంగ్వేజ్, లుక్ కోసం కొరటాల శివ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ ఇప్పటివరకు తెరకెక్కించిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాలు ఘనవిజయాలుగా నిలిచాయి. చిరంజీవితో తెరకెక్కించబోయే చిత్రం కూడా అభిమానులకు గుర్తుండిపోయే చిత్రం కావాలని కొరటాల భావిస్తున్నాడు.

మెగాస్టార్ కొత్త లుక్
ఈ చిత్రంలో చిరు రైతు పాత్రలో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. దీనితో చిరంజీవి లుక్ పై కొరటాల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా చిరుని ఈ చిత్రంలో చూపించాలని కొరటాల భావిస్తున్నాడు. త్వరలో మెగాస్టార్ లుక్ ని డిసైడ్ చేసి అందుకు తగ్గట్లుగా బరువు తగ్గమని కొరటాల సూచించనున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్లుగా వారిద్దరేనా
ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తమన్నా, శృతి హాసన్ ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన నటించబోతున్నట్లు తెలుస్తోంది. శృతి హాసన్ పాత్ర వైవిధ్యంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత ఏడాది విడుదలైన భరత్ అనే నేను చిత్రం పూర్తయినప్పటి నుంచి కొరటాల చిరు కోసం ఎదురు చూస్తున్నాడు.

రాంచరణ్ నిర్మాణంలోనే
ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రాంచరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సైరా చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయనున్నట్లు ఇటీవల రాంచరణ్ ఆర్ఆర్ఆర్ మీడియా సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











