Chiranjeevi konidela: ఈ జీవితం నాది కాదు, మొత్తం తనదే.. చిరు ఎమోషనల్ పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన.. అనేక సినిమాల్లో హీరోగా చేసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. 150కిపైగా చిత్రాలు చేసిన ఈయనతు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే... మా అన్నయ్య, మా అన్నయ్య అంటూ ప్రాణాలు సైతం ఇచ్చే అభిమానులు ఉన్నారు. ఆయన ఏం చేసినా తెగ ఇష్టపడుతూ సపోర్ట్ చేస్తుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల ప్రేమను అందుకుంటున్న ఈయన.. తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. తన జీవితం తనదు కాదని... మొత్తం ఆమెదే అంటూ చెప్పుకొచ్చారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చిరంజీవి కొణిదెల.. 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు పుట్టాడు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్ కావడంతో.. చిరంజీవి కాస్త ఎక్కువగా తన తాతయ్య వద్ద ఉండి చదువుకున్నాడు. అప్పుడే ఈయన సినిమాలపై ఆసక్తి పెరిగింది. కానీ చదువును పక్కన పెట్టకుండా.. చదువు పూర్తి చేసుకుని మరీ చెన్నై వెళ్లి యాక్టింగ్ నేర్చుకున్నాడు. అలా సినీ రంగ ప్రవేశం చేసిన ఈయనకు.. తల్లిదండ్రుల సపోర్ట్ ఎప్పుడూ ఉంది.

అద్భుతమైన అందం, అంతకు మించిన నటనా, డ్యాన్స్ టాలెంట్ ఉండడంతో.. ఆయన త్వరలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. చాలా ఏళ్ల పాటు తెలుగు సినీ రంగాన్ని ఏలేశారు. ఈయనతో పాటు ఆయన తమ్ముళ్లు నాగబాబు కొణిదెల, పవన్ కల్యాణ్ కొణిదెలలు కూడా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ సాధించారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హవా టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంత పెద్ద హీరోలు అయినా.. వీరంతా కలిసే ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిస్తున్నారు.
ముఖ్యంగా కుటుంబ విలువలు బాగా తెలిసిన చిరంజీవి తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈయన తాజాగా మాతృదినోత్సవం సందర్భంగా పలు విషయాలు చెప్పుకొచ్చాడు. తనతో పాటు తన తల్లి అంజనా దేవి, భార్య సురేఖలు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. అలాగే జన్మను ఇచ్చి పెంచి, పోషించిన అమ్మకి ఈ ఒక్క రోజు ఏంటి.. ప్రతీ రోజు అమ్మదే అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా.. ఈ జీవితమే అమ్మది అంటూ తన మనసులోని భావాలను రాసుకొచ్చారు. కింద.. హ్యాపీ మదర్స్ డే అంటూ విష్ చేశారు.
చిరంజీవి పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మీరు మీ అమ్మతో ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి తల్లి అంజనా దేవి ఆయన వద్దే ఉంటుంది. పవన్ కల్యాణ్ తో పాటు నాగబాబులు అప్పుడప్పుడూ ఆమె వద్దకు వెళ్లి వస్తుంటారు. గతంలో అందరి ఇళ్ల్లల్లోనూ ఉండే ఈమె ఆరోగ్యరిత్యా ప్రస్తుతం పెద్ద కొడుకు వద్దే ఉంటుంది.


Click it and Unblock the Notifications











