సినిమా అద్భుత సౌధం.. వాళ్లే పునాదులు: చిరంజీవి.. తారలతో హోరెత్తిన వేడుక (ఫొటోలు)

తెలుగు సినిమా పరిశ్రమలో సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్‌కు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 8వ తేదీ (ఆదివారం) రాత్రి హైదరాబాద్‌లో సినీ మహోత్సవం పేరుతో ఓ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తారల ఆటపాటలు, వినోద కార్యక్రమాలతో ఉత్సాహ భరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి అలనాటి తారలుతోపాటు, నేటి యువతరం తారలు కూడా హాజరయ్యారు.

వేడుకు హాజరైన ప్రముఖులు

వేడుకు హాజరైన ప్రముఖులు

సినీ మహోత్సవం కార్యక్రమానికి హాజరైన వారిలో చిరంజీవి, మహేష్‌బాబు, రాజశేఖర్, పూజా హెగ్డే, క్యాథరీన్ త్రెసా, అనసూయ, లావణ్య త్రిపాఠి, శివాత్మిక, రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖాన్నా, దేవీ శ్రీ ప్రసాద్, కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, అధ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామి, టీ సుబ్బిరామిరెడ్డి, ఆర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఉద్వేగంగా చిరంజీవి

ఉద్వేగంగా చిరంజీవి

సినీ ప్రొడక్షన్‌కు సంబంధించిన మేనేజర్ల సేవల గురించి మెగాస్టార్ చిరంజీవి ఉద్వేగంగా మాట్లాడారు. సినిమా అనేది అద్భుతమైన సౌధం అనుకొంటే, మేనేజర్లు, ప్రొడక్షన్ టీమ్ పునాదిరాళ్లు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

చిరంజీవిని కలిసిన తర్వాత

చిరంజీవిని కలిసిన తర్వాత

సినీ మహోత్సవం కార్యక్రమంలో చిరంజీవి పక్కన కూర్చోవడం, ఈ వేడుకలో పాల్గొనడం చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. చిరంజీవిని కలిసిన తర్వాత నా ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి అని అన్నారు.

భారీ విరాళాలతో ప్రముఖులు

భారీ విరాళాలతో ప్రముఖులు

సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్‌కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు 32 లక్షలు, మా అసోసియేషన్ తరఫున వీకే నరేష్ రూ.10 లక్షలు, జీవితా రాజశేఖర్ రూ.10 లక్షలు, బ్యాంకాక్ బాబీ రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు.

కన్నుల పండువగా

కన్నుల పండువగా

సినీ మహోత్సవం కార్యక్రమంలో కృష్ణ, కృష్ణంరాజు, గిరిబాబు, మురళీమోహన్, గీతాంజలిను యూనియన్ సత్కరించింది. ఈ కార్యక్రమం ఆటపాటలతో హోరెత్తింది. ఆద్యంతం ఈ కార్యక్రమం కన్నుల పండుగా మారింది.

చిరంజీవితో ప్రియదర్శి సెల్ఫీ

చిరంజీవితో ప్రియదర్శి సెల్ఫీ

సినీ మహోత్సవంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో సెల్పీ దిగుతున్న యువ నటుడు ప్రియదర్శి.. చిత్రంలో నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నారు.

జయప్రద, జయసుధ

జయప్రద, జయసుధ

సినీ మహోత్సవంలో పాల్గొన్న అలనాటి అందాల తారలు జయప్రద, జయసుధ. ప్రొడక్షన్ యూనియన్, మేనేజర్ల సేవలను వీరు కొనియాడారు.

దేవీ శ్రీ ప్రసాద్ ఆటపాట

దేవీ శ్రీ ప్రసాద్ ఆటపాట

సినీ మహోత్సవంలో ఆటపాటలతో హోరెత్తిస్తున్న దేవీ శ్రీ ప్రసాద్... ఈ సందర్భంగా తన ఎనర్జీ లెవెల్స్‌తో కార్యక్రమానికి హాజరైన ప్రతీ ఒక్కరిని జోష్‌లో ముంచేశారు.

హోరెత్తించిన గాయనీ, గాయకులు

హోరెత్తించిన గాయనీ, గాయకులు

ఆటపాటలతో హోరెత్తిస్తున్న గాయనీ, గాయకులు.. తాజా, పాత పాటలతో కార్యక్రమం పసందుగా మారింది.

ఫ్యామిలీతో రెబల్ స్టార్

ఫ్యామిలీతో రెబల్ స్టార్

సినీ మహోత్సవంలో పాల్గొన్న కృష్ణంరాజు దంపతులు. రెబల్ స్టార్ కుటుంబ సమేతంగా హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

మెగా ఫ్యామిలీ సందడి

మెగా ఫ్యామిలీ సందడి

సినీ మహోత్సవంలో పాల్గొన్న మెగా బ్రదర్ నాగబాబు, మెగా డాటర్ నిహారిక కొణిదెల

రకుల్ ప్రీత్, పూజా హెగ్డే

రకుల్ ప్రీత్, పూజా హెగ్డే

సినీ మహేత్సవం వేడుకలో యువతరాలు మెరిసారు. ఈ కార్యక్రమానికి హాజరైన రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే.

మెరిసిన లావణ్య త్రిపాఠి

మెరిసిన లావణ్య త్రిపాఠి

సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్‌ కార్యక్రమంలో పాల్గొన్న లావణ్య త్రిపాఠి, రుక్సానా

నిహారిక కొణిదెల

నిహారిక కొణిదెల

సినీ మహోత్సవం కార్యక్రమంలో చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్, నిహారిక కొణిదెల

అలనాటి తారలు సుమలత, జయసుధ, జయప్రద

అలనాటి తారలు సుమలత, జయసుధ, జయప్రద

అలనాటి తారలు సుమలత, జయసుధ, జయప్రద. ఈ కార్యక్రమంలో సీనియర్ నటులు పాల్గొనడం, అప్పటి అనుభూతులను పంచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X