»   » కంటతడి పెట్టిన మెగాస్టార్ చిరంజీవి దంపతులు

కంటతడి పెట్టిన మెగాస్టార్ చిరంజీవి దంపతులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సినీ నిర్మాత కేసీ శేఖ‌ర్ బాబు హాఠన్మారణంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. శేఖర్ బాబు మృతదేహానికి పలువురు ప్రముఖులు, సన్నిహితులు శ్రద్ధాంజలి ఘటించారు.

ఉద్వేగానికి గురైన మెగాస్టార్ చిరంజీవి దంపతులు

ఉద్వేగానికి గురైన మెగాస్టార్ చిరంజీవి దంపతులు

నిర్మాత శేఖర్ బాబు మ‌ృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించిన వారిలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఉన్నారు. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ శేఖర్ బాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. శోకసంద్రంలో మునిగిన శేఖర్ బాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు. శేఖర్ బాబు మృతదేహాన్ని చూసి చిరంజీవి దంపతులు ఉద్వేగానికి గురయ్యారు. ఓ దశలో వారు కంటతడి పెట్టారు.

శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూత

శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూత

నిర్మాత కేసీ శేఖ‌ర్ బాబు (71) శుక్ర‌వారం రాత్రి హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని సినీ ప్రముఖులు షాక్ గురయ్యారు.

అగ్రనటులు కృష్ణ, చిరంజీవితో చిత్రాలు

అగ్రనటులు కృష్ణ, చిరంజీవితో చిత్రాలు

నిర్మాత శేఖర్ బాబు కృష్ణ -జ‌మున కాంబినేష‌న్ లో `మమత`, అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ త‌ర్వాత కృష్ణతో `స‌ర్దార్` అనే చిత్రాన్ని నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవితో `ముఠామేస్త్రీ` నిర్మించి భారీ హిట్ ను సొంతం చేసుకొన్నారు. ఆయన నిర్మించిన చిత్రాల్లో `సంసారబంధం`, `గోపాలరావుగారి అమ్మాయి`, `పక్కింటి అమ్మాయి` ఉన్నాయి.

దక్షిణాది సినీ పరిశ్రమకు విశేష సేవలు

దక్షిణాది సినీ పరిశ్రమకు విశేష సేవలు

తెలుగు, దక్షిణాది సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి కూడా శేఖర్ బాబు విశేష సేవ‌లందించారు. ఫిలిం సెంట్ర‌ల్ బోర్డ్ చైర్మ‌న్ గా, ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీగా గా ఆయ‌న ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాది ఫిలించాంబ‌ర్ క‌మిటీ మెంబ‌ర్ గా సేవ‌లందిస్తున్నారు. ఇంత‌లోనే ఆయ‌న హాఠాన్మ‌ర‌ణం టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ని క‌ల‌చి వేసింది. శేఖర్‌బాబు మృతిపట్ల పలువురు సినీ నటులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.

English summary
Tollywood Film producer KC Shekhar Babu passed away with Heart Attack on friday night in Hyderabad. Megastar Chiranjeevi, his wife Surekha condoles shekhar babu family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu