twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గౌతమ్ రాజు కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్ధిక సాయం.. మేమున్నామని భరోసా!

    |

    టాలీవుడ్ కి చెందిన ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హాస్పిటల్ లో కొన్నాళ్లపాటు చికిత్స తీసుకున్నారు. చికిత్స తీసుకున్న తర్వాత సెట్ అయింది అనుకొని డిశ్చార్జ్ ఇంటికి వచ్చిన తర్వాత అనూహ్య పరిస్థితుల్లో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. ఆయన ఇద్దరు కుమారులు హైదరాబాద్ లో ఉండడంతో బుధవారం నాడు సాయంత్రం మోతీ నగర్ లోని ఆయన నివాసం నుంచి అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. మోతీ నగర్ స్మశాన వాటికలో ఆయన దహన సంస్కారాలు కూడా పూర్తయ్యాయి.

    అయితే ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేనున్నానంటూ ముందుకు వచ్చే మెగాస్టార్ చిరంజీవి నూతన రాజు కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రకటించడమే కాక దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేత గౌతమ్ రాజు నివాసానికి రెండు లక్షల రూపాయలు నగదు పంపించారు. అంతేగాక సినీ పరిశ్రమ మీకు అండగా ఉంటుందని మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విషయాలలో అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. గౌతమ్ రాజు తెలుగు సహా దక్షిణాది భాషల్లో సుమారు 800 సినిమాలకు పైగా ఎడిటర్ గా వ్యవహరించారు. ఆయన ప్రస్తుతానికి కొన్ని సినిమాలకు ఇప్పుడు కూడా ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

    Megastar chiranjeevi financial help to editor goutham raju family

    గౌతమ్ రాజు మరణంతో మెగాస్టార్ చిరంజీవి మొదలు మోహన్ బాబు, రామ్ చరణ్ తేజ, ఎన్టీఆర్, బాలకృష్ణ, ఆర్పీ పట్నాయక్ వంటి వారు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గౌతమ్ రాజు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీర్చలేని లోటని వారంతా సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. గౌతమ్ రాజు 1954 జనవరి 15న ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు జన్మించారు. అయినప్పటికీ గౌతమ్ రాజు పెరిగింది.. విద్యాభ్యాసం కొనసాగించింది మాత్రం తమిళనాడు మద్రాసు పట్టణంలో. . గౌతమ్ రాజు తన చదువును 'బీఏ' వరకు పూర్తి చేసి సినిమాలపై ఇష్టంతో అరుణాచలం స్టూడియోలోని రికార్డింగ్ థియేటర్ లో ఆపరేటర్ (అప్రెంటిస్)గా జాయిన్ అయ్యాడు. ఏడాది పాటు అక్కడే పనిచేసిన ఆయన తర్వాత తమిళ నటుడు రాజేంద్రకు చెందిన 'రాజేంద్ర టూరింగ్ టాకీస్'లో ఆపరేట్ గా చేరి లైసెన్స్ పొందారు. అక్కడ పనిచేస్తూ ఎడిటర్ దండపాణి వద్ద అసిస్టెంట్ గా చేరి మెళకువలు నేర్చుకున్న ఆయన లో-బడ్జెట్ లో వచ్చే మళయాళ, ఒరియా సినిమాలకు ఎడిటర్ గా వర్క్ చేయడం మొదలు పెట్టి స్టార్ ఎడిటర్ గా మారారు.

    English summary
    Megastar chiranjeevi financial help to editor goutham raju family, he sent 2 lakhs through thammareddy bharadwaja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X