60లో కూడా ఆగట్లేదుగా.. రజినీకాంత్ బాటలోనే మెగాస్టార్.. గ్యాప్ లేకుండా సినిమాలు!

ఒకప్పుడు స్టార్ ఇమేజ్ అనే దానితో సంబంధం లేకుండా హీరోలు చాలా వేగంగా సినిమాలు చేసేవారు. ఒక సినిమా హిట్టయినా ప్లాప్ అయినా పెద్దగా పట్టించుకోకుండా ప్రయోగాలు చేస్తుండేవారు. అయితే వయసు పెరిగిన కొద్దీ సాధారణంగా నటీనటులు సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేస్తారు. కానీ టాలీవుడ్ మెగాస్టార్, కోలీవుడ్ సూపర్ స్టార్ మాత్రం స్పీడ్ డోస్ పెంచుతున్నారు.

 ఆరు పదుల వయసొచ్చినా..

ఆరు పదుల వయసొచ్చినా..

మెగాస్టార్ చిరంజీవి 64లో ఉండగా సూపర్ స్టార్ రజినీకాంత్ 69 దాటేశారు. దాదాపు ఒకే వయసులో ఉన్న ఈ స్టార్ హీరోలు ఒకానొక దశలో చాలా వేగంగా సినిమాలను పూర్తి చేశారు. ఇక స్టార్ డమ్ పెరిగిన తరువాత 50 ఏళ్ల వరకు కొంచెం స్లోగా సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు ఆరు పదుల వయసు రావడంతో రెస్ట్ తీసుకునే సమయం వచ్చింది అని నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి కౌంటర్ ఇస్తున్నారు. తీరిక లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

 స్పీడ్ పెంచిన రజినీకాంత్..

స్పీడ్ పెంచిన రజినీకాంత్..

రోబో కంటే ముందు వరకు రజినీకాంత్ చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తూ వచ్చారు. అలాగే ఫామ్ లో ఉన్న సీనియర్ దర్శకులవైపే మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు మాత్రం తలైవా స్పీడ్ పెంచుతున్నారు. పా.రంజిత్, కార్తిక్ సుబ్బరాజన్ వంటి యంగ్ డైరెక్టర్స్ తోనే కాకుండా మురగదాస్, శివ వంటి టాలెంటెడ్ దర్శకులతో కూడా మొదటిసారి డిఫరెంట్ సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

రజినీకాంత్ బాటలోనే మెగాస్టార్..

రజినీకాంత్ బాటలోనే మెగాస్టార్..

సూపర్ స్టార్ రజినీకాంత్ తరహాలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నేటితరం యంగ్ దర్శకులతో వర్క్ చేయడానికి మెగాస్టార్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కథ నచ్చితే ఎలాంటి దర్శకుడైనా పరవలేదని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఫామ్ లో లేని మెహర్ రమేష్ తో కూడా సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న చిరు.. సుజిత్, బాబీ వంటి యంగ్ దర్శకులతో కూడా సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

Recommended Video

Star Heros Special Target On Dussehra Holidays
ఆచార్య సినిమాతో ఫుల్ బిజీ..

ఆచార్య సినిమాతో ఫుల్ బిజీ..

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసిన మెగాస్టార్ ఆ సినిమాకు సంబంధించిన కొత్త ప్లాన్ తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ అనంతరం వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ సెట్ చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X