తమ్ముడిపై చిరంజీవి ఆగ్రహం.. అన్నయ్యని ఆ మాట అనలేక!
మెగా బ్రదర్స్ చిరు, నాగబాబు, పవన్ మధ్య బంధం ఎంత అన్యోన్యంగా ఉంటుందో అందరికి తెలిసిందే. అన్నయ్య అంటే తమకు ఎంత ఇష్టమో పలు వేదికలపై అటు నాగబాబు, ఇటు పవన్ పలు సందర్భాల్లో వివరించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తమ్ముళ్లపై అంతే ప్రేమతో ఉంటారు. మెగాస్టార్ చిరంజీవికి నాగబాబుని కొట్టేంత కోపం ఓ సంద్భరంలో వచ్చిందంటే నమ్మగలరా. నిజంగానే అంత కోపం వచ్చిందని మెగాస్టార్ చిరంజీవి ఓ సందర్భంలో తెలిపాడు.

చిన్నతనంలో జరిగిన ఘటన
ఎప్పుడైనా నాగబాబుని మీరు ఆగ్రహించుకున్నారా అనే ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి సమాధానం ఇచ్చాడు. నేను ఇంటర్మీడియెట్ చదువుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కోపంతో నాగబాబుని కొట్టేశాను కూడా. ఆ సమయంలో నాగబాబు ఏడవ తరగతి చదువుతున్నాడు.

అమ్మకు సాయంగా
ఆ సమయంలో నేను అమ్మకు ఇంట్లో అన్ని విధాలుగా సాయపడేవాడిని. లాండ్రిలో ఇచ్చిన బట్టలు తీసుకురమ్మని అమ్మ నాతో చెప్పింది. అదే సమయంలో పనిమీద నేను వేరే చోటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో తమ్ముడు నాగబాబు ఖాళీగానే ఉన్నాడు. ఒకేసారి రెండు పనులు చేయడం కష్టం కాబట్టి లాండ్రీ నుంచి బట్టలు తీసుకురమ్మని వాడికి చెప్పా. నేను పనిమీద బయటకు వెళ్ళా.

తిరిగివచ్చేసరికి
ఇంటికి తిరిగివచ్చి బట్టలు తీసుకుని వచ్చావా అని నాగబాబుని అడిగా.. తీసుకురాలేదు, నిద్రపోతున్నా అని చెప్పాడు. నాకు విపరీతంగా కోపం వచ్చి వాడిని కొట్టేశా. అమ్మ చూసి చిన్న వాడిని లా కొడతావా అంటూ నన్ను తిట్టింది.

నాన్న వచ్చాక
సాయంత్రం నాన్న ఇంటికి వచ్చాక ఏడుస్తూ జరిగిన విషయం చెప్పా. నాన్న నాగబాబుని మందలించాడు. అప్పుడు నాకు బాగా అనిపించింది అని మెగాస్టార్ తెలిపారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.

అంజి షూటింగ్‌లో
నాగబాబు, చిరు కలసి పలు చిత్రాల్లో నటించారు. అంజి చిత్రంలో నాగబాబు పెద్ద వయస్కుడి పాత్ర. చిరంజీవిని నాగబాబు ఒరేయ్, ఏరా అని పిలవాలి. తాను అన్నయ్యని అలా పిలవలేనని చిత్ర యూనిట్ తో నాగబాబు చెప్పేశాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ మెగాస్టార్ దృష్టికి తీసుకువెళ్లగా.. ఇవి మనం నటిస్తున్న పాత్రలు మాత్రమే.. పర్వాలేదు పిలువు అని చెప్పడంతో నాగబాబు అగీకరించాడట.


Click it and Unblock the Notifications











