Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
IFFI2022: చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన.. లెజెండ్ల సరసన మెగాస్టార్
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్, స్టైల్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఆయన.. ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను భారీగా ఏర్పరచుకున్నారు. మరీ ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవికి ఓ ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. ఆ సంగతులు మీకోసం!

డిజాస్టర్‌తో చిరంజీవికి షాక్
రీఎంట్రీలో జెట్ స్పీడుతో దూసుకుపోతోన్న మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సమ్మర్‌లో ‘ఆచార్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రామ్ చరణ్ కూడా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన దక్కలేదు. ఫలితంగా ఇది చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
Bigg Boss Nominations: లీకైన 12వ వారం నామినేషన్స్.. శ్రీ సత్యకు బిగ్ బాస్ షాక్.. నామినేట్ ఎవరంటే!

గాడ్ ఫాదర్‌తో సంతృప్తితో
‘ఆచార్య' డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్' అనే సినిమాను చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ హిట్ మూవీ ‘లూసీఫర్'కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. అలా దాదాపు రెండు వారాల పాటు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

రెండు సినిమాలతో బిజీగా
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్' అనే మూవీ కూడా చేస్తున్నారు. ఇది కూడా చాలా వరకు షూట్ కంప్లీట్ చేసుకుంది. అలాగే, బాబీతో ‘వాల్తేరు వీరయ్య' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ కూడా దాదాపుగా టాకీ పార్టును కంప్లీట్ చేసేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది.
బికినీలో షాకిచ్చిన దీపికా పిల్లి: ఎద అందాలు ఆరబోస్తూ హాట్ షో

చిరంజీవికి ఎన్నో అవార్డ్స్
2006లో చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది. 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటును అందుకున్నారు. వీటితో పాటు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు, నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆయనను వరించాయి. ఇలా ఎన్నో పురస్కారాలను అందుకున్న ఆయన తన ఖ్యాతిని మరింతగా పెంచుకుంటూనే ఉన్నారు.

మరో ప్రతిష్టాత్మక అవార్డు
53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకను కేంద్ర ప్రభుత్వం గోవాలో నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో సినీ రంగంలో విశేషమైన సేవలు అందించిన పలువురికి అవార్డులను ప్రకటించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు లభించింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
యాంకర్ మంజూష అందాల అరాచకం: పైటను పక్కకు జరిపి మరీ హాట్ షో

లెజెండ్ల సరసన చిరంజీవి
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కొన్నేళ్లుగా ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డులను ప్రకటిస్తోంది. ఇందులో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, హేమమాలిని, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి లెజెండ్లు దీన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి ఈ అత్యుత్తమ అవార్డు సొంతం అయిపోయింది.

రెండు.. ఫ్యాన్స్ సంతోషం
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘వాల్తేరు వీరయ్య' సినిమా నుంచి నవంబర్ 23 తేదీన సాయంత్రం 4.05 గంటలకు ‘బాస్ పార్టీ' అనే సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అదే రోజు ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డు కూడా దక్కింది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతోన్నారు. ఇక, చిరుకు అభినందనలు వస్తున్నాయి.