చిరుతకు కొత్త అర్థం చెప్పిన చరణ్..క్లింకారా స్పెషల్ విషెస్..చిన్నారి ఎలా ఉందో చూశారా?
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కావడంతో... మెగా అభిమానులు ఈరోజును పండగలా జరుపుకుంటున్నారు. మరోవైపు చిరంజీవికి రాజీకయ ప్రముఖులు, సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇదిలా ఉంటే.. చిరంజీవి మనవరాలు, రామ్ చరణ్ కూతురు.. చిరుకు విషెష్ చెప్పింది. ఈ పోస్టును రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే...
ఆగస్టు 22 అంటే.. మెగా అభిమానులకు పెద్ద పండుగ. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో... వారు దసరా, దీపావళి పండుగల్లా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక చిరంజీవికి రాజకీయ, సీని ప్రముఖుల నుంచి విషెష్ వెల్లువెత్తగా.. మరోవైపు చిరంజీవి తన తదుపరి సినిమా అప్డేట్స్ కూడా వచ్చేశాయి. ఇక మెగా 156, మెగా 157 పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. దీనితో ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఇక మెగా156 సినిమా విషయానికి వస్తే.. కూతురి ప్రొడక్షన్ హౌజ్ లోనే చేయనున్నారు మెగాస్టార్. ఈ సినిమా డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ అని మొదటి నుంచి అనుకున్నారు. కానీ కొత్త క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. జస్ట్ పోస్టర్ మాత్రం రిలీజ్ చేశారు. ఇక మెగా 157 సినిమా.. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రానుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.
మెగా 157 సినిమా సోషియో ఫాంటసీగా రూపొందనుంది. ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే.. పంచాభూతాలతో చిరు ప్రయోగం చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండు సినిమా అప్డేట్స్ తో మెగా ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ దంపతులు ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాపకు క్లిం కారా అని చిరంజీవి నామాకరణం చేశారు.

ఇక అయితే చిరంజీవికి క్లిం కారా విషెష్ చెబుతున్నట్లు ఓ స్పెషల్ ఫోటోను రామ్ చరణ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలో చిరుతో పాటు చరణ్ కూతురు, మెగా మనవరాలు క్లిం కారా కూడా ఉంది. క్లింకారా ఫేస్ రివీల్ చెయ్యకుండా చరణ్ పోస్ట్ చేశారు. ఇక ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి మెగా అభిమానిని హ్యాపీ చేసింది. మనవరాలిని ఎత్తుకోని నవ్వుతున్న చిరుని చూసి మెగా ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీ అవుతున్నారు.
ఇక ఈ పోస్ట్ విషయానికి వస్తే.. హ్యాపియెస్ట్ బర్త్ డే టు అవర్ డియరెస్ట్ 'చిరుత' - (చిరంజీవి తాత) లోడ్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ అజ్ అండ్ ది లిటిలెస్ట్ మెంబర్ ఆఫ్ ది కొణిదెల ఫ్యామిలీ అంటూ ఓ క్వోట్ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ లో చరణ్.. చిరుతకు కొత్త అర్ధం చెప్పడం విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications











