చిరంజీవిని పరేషాన్ చేసిన మనవరాలు.. మిమీ అంటూ ఆటపట్టించిన మెగాస్టార్

లాక్ డౌన్ కారణంగా సినీ తారలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఎప్పుడు షూటింగ్ లతో బిజీగా ఉండే స్టార్స్ గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ తో ముందుపెన్నడు లేని విషంగా సరదాగా గడుపుతున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ తన మనవరాలితో సరదాగా గడిపిన క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చూపించారు.

Recommended Video

Megastar Chiranjeevi Enjoying Music With Grand Daughter Navishka
సోషల్ మీడియాతో ఫుల్ బిజీ..

సోషల్ మీడియాతో ఫుల్ బిజీ..

మెగాస్టార్ సోషల్ మీడియాలో అడుగుపెట్టిన తరువాత అభిమానులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారనే చెప్పాలి. గ్యాప్ లేకుండా ప్రతి విషయంపై స్పందిస్తూ తోటి హీరోలపై కూడా స్నేహపూర్వక ట్వీట్స్ తో మంచి ఫన్ క్రియేట్ చేస్తున్నారు. మెగాస్టార్ లాక్ డౌన్ లో స్పెషల్ గా కనిపిస్తున్నారు. ఇక స్పెషల్ గా సిసిసి ఫౌండేషన్ ద్వారా పేద కళాకారులకు కూడా సహాయాన్ని అందిస్తున్నారు.

మనవరాలితో అల్లరి..

మనవరాలితో అల్లరి..

రీసెంట్ గా మెగాస్టార్ తన మనవరాలితో సరదాగా గడిపిన క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చూపించారు. శ్రీజా, కళ్యాణ్ దేవ్ చిన్న కుమార్తె నవిష్కను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏ పాట కావాలని అడిగారు. అందుకు నవిష్క తనకు ఖైదీ నెంబర్ 150లోని 'మిమీ మిమ్మి' అంటూ యూ అండ్ మీ పాట గురించి ముద్దుగా అడిగింది.

చిరుకి షాక్..

ఎన్నిసార్లు ఆ సాంగ్ వింటావ్ అని చిరు అడగ్గా.. ఆ చిన్నారి తన ఏడుపు ఆయుధాన్ని ఉపయోగించి బోల్తా కొట్టించింది. ఏడుస్తూ వెళ్లిపోవడానికి ట్రై చేయడంతో చిరంజీవి చేసేదేమీ లేక అదే సాంగ్ పెట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ అలా మనవరాలితో అల్లరిగా ఆడుకోవడం నెటీజన్స్ ని ఎట్రాక్ చేస్తోంది. ఇక ఏడాది వయసు కలిగిన నవిష్క మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడం చూస్తుంటే హ్యాపీగా ఉందని, పాట నాదే కాబట్టి, అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్ నాకే అని మెగాస్టార్ సరదాగా కామెంట్ చేశారు.

బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ ..

బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ ..

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాతో పాటు మరో మూడు ప్రాజెక్టులను ఒకే చేయడానికి మెగాస్టార్ చర్చలు జరుపుతున్నారు. లుసిఫర్ రీమేక్ తో పాటు బాబీ దర్శకుడితో అలాగే మెహర్ రమేష్ తో కూడా మెగాస్టార్ సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X