దాసరి పేరుకు అసలైన అర్ధాన్ని చెప్పిన మెగాస్టార్.. ఎమోషనల్ మూమెంట్!

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుండే వారు దివంగత దర్శకులు దాసరి నారాయణ రావు. ఇండస్ట్రీపై ఎవరైనా కామెంట్ చేస్తే వెంటనే కౌంటర్ ఇచ్చి నోరు మూయించేవారు. చిత్ర పరిశ్రమను అమితంగా గౌరవించే దాసరి అంటే ప్రతి ఒక్కరికి గౌరవమే. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో తెలుగు సినీ ప్రముఖులు ఆయనతో గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా దాసరి నారాయణ రావు గురించి అద్భుతమైన ట్వీట్ చేసి ఆయనపై ఉన్న గౌరవాన్ని బయటపెట్టారు. దాసరి అనే పదానికి తనదైన శైలిలో సరైన అర్ధాన్ని చెప్పి ఆడియెన్స్ కి మంచి కిక్కిచ్చారు.
"దా..దానంలో కర్ణుడుమీరు
స..సమర్ధతలో అర్జునుడుమీరు
రి..రిపువర్గమేలేని ధర్మరాజుమీరు" అంటూ 'దాసరి' అక్షరాలకు కొత్త అర్ధాన్ని చెప్పారు.

Megastar chiranjeevi heart touching tweet on dasari narayana rao

ఇక మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుందిని ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుందని మెగాస్టార్ తన గురువు పట్ల ఉన్న భక్తిని చాటుకున్నారు. ఇక గతంలో దాసరి ఆరోగ్యంపై అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో మెగాస్టార్ ఆయన పక్కన ఉండి ధైర్యం చెప్పారు. దాసరి నిర్వహించిన ఆఖరి ప్రెస్ మీట్ లో కూడా మెగాస్టార్ సపోర్ట్ గా ఉన్నారు. ఆ సమయంలోని ఏమోషనల్ ఫోటోని చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X