క్యాన్సర్‌తో భాదపడుతున్న నటి, మెగాస్టార్ సాయం.. స్వయంగా ఇంటికి వెళ్లిన చిరు కుమార్తె శ్రీజ!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా చిత్ర షూటింగ్ తో బిజీగా గడుపుతున్నారు. ఆపదలో కష్టాల్లో ఉన్న ఎవరికైనా సాయమా అందించే స్వభావం చిరంజీవి సొంతం. సీనియర్ నటి సుభాషిణి గత కొంతకాలంగా క్యాన్సర్ తో బదపడుతున్నారు. ఆమె పలు టాలీవుడ్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. బెండు అప్పారావు, సూర్య వర్సెస్ సూర్య, సుడిగాడు వంటి చిత్రాల్లో ఆమె నటించారు.

సుభాషిణి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి సాయం అందించడానికి ముందుకు వచ్చారు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ స్వయంగా సుభాషిణి ఇంటికి వెళ్లి ఆమెని పరామర్శించడం విశేషం. సుభాషిణి ఆరోగ్యం గురించి ఆరా తీసిన శ్రీజ రూ 2 లక్షల ఆర్థిక సాయం అందజేయడం విశేషం.

నటి సుభాషిణిని పరామర్శిస్తున్న శ్రీజ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సుభాషిణి ఫోన్ లో మెగాస్టార్ చిరంజీవికు కృతజ్ఞతలు తెలియజేసినట్లు తెలుస్తోంది. చిరు కుమార్తె తన ఇంటికి వచ్చి మరి సాయం అందజేయడంతో సుభాషిణి భావోద్వేగానికి గురయ్యారు.


Click it and Unblock the Notifications











