చిరంజీవితో సమంత అక్కినేని.. మరో సెన్సేషన్‌కు రెడీ
దక్షిణాది సినీ పరిశ్రమలో దశాబ్ద కాలంగా అగ్రతారగా రాణిస్తున్న సమంత అక్కినేని తన రూటు మార్చి విభిన్నమైన భూమికలను పోషిస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో విరామం లభించడంతో పలు విషయాలపై సమంత ఫోకస్ పెంచారు. తాజాగా బిగ్‌బాస్ హోస్ట్‌గా ఆకట్టుకొన్న సమంత అక్కినేని ప్రస్తుతం ఆహా ఓటీటీలో సామ్ జామ్ అనే రియాలిటీ షోకు ఫుల్‌టైమ్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలో సమంత మరో స్పెషల్ ఎపిసోడ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తూ..

డిజిటల్ మీడియాలోకి సమంత ఎంట్రీ
లాక్‌డౌన్‌కు ముందు ఆ తర్వాత సమంత అక్కినేని పలు కార్యక్రమాలతో బిజీగా మారిపోయారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో డిజిటల్ మీడియాలోకి ప్రవేశించారు. అత్యంత ప్రేక్షదారణ పొందిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 2లో నటించారు. ఆ తర్వాత డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. వెబ్ సిరీస్ ద్వారా త్వరలోనే బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఫస్ట్ ఎపిసోడ్‌లో విజయ్ దేవరకొండ
ఇక బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన తర్వాత ఆహా యాప్‌లో సామ్ జామ్ అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు. ప్రారంభ ఎపిసోడ్‌లో విజయ్ దేవరకొండను ఆహ్వనించి సామ్‌జామ్‌ను క్రేజీగా మార్చారు. సామాజిక అంశాలు జోడించి సామ్‌జామ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు.

చిరంజీవితో రెండో ఎపిసోడ్
ఇక రెండో ఎపిసోడ్‌లో మెగాస్టార్ చిరంజీవిని సామ్ జామ్ షోకు ఆహ్వానించారు. రెండో ఎపిసోడ్‌ను బుధవారం షూట్ చేయడం, దానికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిరంజీవిని ఆహ్వానిస్తున్న ఫోటోలు, సమంతతో కలిసి చిరంజీవి ఉన్న ఫోటోలు మీడియాలో హల్‌చల్ చేశాయి. చిరంజీవితో సమంత చేసిన ఇంటర్వ్యూలో త్వరలోనే ప్రసారం కానున్నది. తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి తనదైన శైలిలో సంచలన విషయాలు, ఫీల్ గుడ్ అంశాలను వెల్లడించడంతో ఆహా టీమ్ సంతోషంగా ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేశారు.

మరికొంత మంది ప్రముఖులతో
సామ్ జామ్ షోకు కాఫీ విత్ కరణ్, నచ్ బలియే లాంటి షోలను రూపొందించిన టీమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. టాలీవుడ్ దర్శకులు నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ షో రూపొందుతున్నది. త్వరలోనే అల్లు అర్జున్, తమన్నా, రష్మిక మందన్న, సైనా నెహ్వాల్, కశ్యప్ పారుపల్లి లాంటి ప్రముఖులు పాల్గొంటారు. ఇంకా చాలా మంది ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. వారెవరూ అనేది సర్‌ప్రైజ్‌గా ఉంచబోతున్నాం అని అల్లు అరవింద్ చెప్పారు.
Recommended Video

ఆచార్య కోసం సిద్దమవుతున్న చిరంజీవి
ఇక చిరంజీవి విషయానికి వస్తే.. లాక్‌డౌన్ తర్వాత ఆచార్య మూవీ షూటింగులో పాల్గొనేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే షూటింగులో పాల్గోనాల్సి ఉండగా.. కరోనా తప్పుడు రిపోర్టుల కారణంగా గందరగోళం నెలకొనడంతో ఆయన షూటింగు దూరంగా ఉన్నారు. కొనాళ్లు చిరంజీవి క్వారంటైన్‌లో ఉంటారనే విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











