For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్ హీరోలతో జగన్ మీటింగ్.. ఈసారి ప్రభాస్ నుంచి బన్నీ వరకు.. మెగాస్టార్ బిగ్ ప్లాన్!

  |

  టాలీవుడ్ సినిమా పరిశ్రమ కరోనాతో పోరాడుతున్న విధానం చాలా ధైర్యంగా ఉందనే చెప్పాలి. ఒక విధంగా మిగతా సినిమా ఇండస్ట్రీలో కంటే కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఇలాంటి కష్టకాలంలో కూడా మన సినిమాలు ఎంతగానో బిజినెస్ ను పెంచుతున్నాయి కరోనా తగ్గితే ఆ డోస్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు బాక్సాఫీస్ మార్కెట్ స్థాయి అయితే తగ్గుతోందని చెప్పాలి.

  ముఖ్యంగా టికెట్ల రేట్ల విషయంలో సినిమా పెద్దలు అసలు సంతృప్తిగా లేరు. అలాగే మరికొన్ని సమస్యలపై కూడా చర్చలు జరపాలని అనుకుంటున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ అగ్రహీరోలు కూడా ఈ నెల 20న జరగబోయే సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం.

  మళ్ళీ ట్రాక్ లోకి తేవాలి అని..

  మళ్ళీ ట్రాక్ లోకి తేవాలి అని..

  గత ఏడాది నుంచి కరోనా వైరస్ లాక్ డౌన్ వలన సినిమా పరిశ్రమలో ఎంతగానో నష్టపోయాయి ఒక విధంగా ఓటీటీ సంస్థల వలన కొంతమంది నిర్మాతలు కష్టాల నుంచి బయటపడ్డారు అనే చెప్పాలి. సినిమా బిజినెస్ భారీగా తగ్గడం వలన ఎన్నో వేల కుటుంబాలు ఆర్ధికంగా వెనుకబడ్డారు. ముఖ్యంగా థియేటర్స్ అయితే చాలా వరకు మూసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక వాటిని మళ్ళీ ట్రాక్ లోకి తేవాలి అని నిర్మాతలు స్టార్ హీరోలు కూడా బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

  ప్రభుత్వంతో మాట్లాడినా కూడా

  ప్రభుత్వంతో మాట్లాడినా కూడా

  ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా మద్దతు లభిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వలేకపోతోంది. ముఖ్యంగా టికెట్ల రేట్ల విషయంలో అయితే నిర్మాతలు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే నాలుగైదు సార్లు ప్రభుత్వంతో మాట్లాడినా కూడా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు.

  వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మీటింగ్

  వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మీటింగ్

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ల రేట్లు ఆధారంగానే సినిమాలు రిలీజ్ అవ్వాలని కొత్త జీవోను ఆర్డర్ చేసిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ అందులో సవరింపులు జరపాలని చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా ప్రభుత్వం తో మాట్లాడటానికి వెళ్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా చిత్రపరిశ్రమకు గుర్తింపు తేవాలనే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇక రీసెంట్ గా మరోసారి చిరంజీవి ఈ సమస్యలపై ఒక పరిష్కారాన్ని తేవాలని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో ఈ నెల 20న మీటింగ్ లో మాట్లాడనున్నారు.

  ఈసారి మిగతా హీరోలు కూడా

  ఈసారి మిగతా హీరోలు కూడా

  అయితే ఈ సమావేశానికి చిరంజీవి కొంతమంది స్టార్ హీరోలను కూడా వెంట పెట్టుకొని వెళ్లనున్నారు. ఎందుకంటే ప్రతి సారి కూడా మెగాస్టార్ చిరంజీవి నాగార్జున అలాగే కొంతమంది సీనియర్ నిర్మాతలు దర్శకులు మాత్రమే సమావేశాలకు హాజరవుతున్నారు ఇక ఈసారి మాత్రం అలా కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న అగ్ర హీరోలు కూడా తీసుకొని వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు.

  Nee Jathaga Movie Official Teaser
  ఎవరెవరు వస్తారంటే?

  ఎవరెవరు వస్తారంటే?

  మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఫోన్ చేసి చర్చల జరిపైనట్లు సమాచారం. రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలకు ప్రత్యేకంగా తెలియజేసినట్లు తెలుస్తోంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో జరగబోయే సమావేశంలో పాల్గొనాలని ఇండస్ట్రీ సమస్యలపై కూడా వారి గొంతును కూడా వినిపించాలని మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లు సమాచారం. ఇక నిర్మాత నుంచి దిల్ రాజు సురేష్ బాబు ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకొని నిర్మతలను ఈ సమావేశానికి తీసుకురానున్నట్లు సమాచారం.

  English summary
  MegaStar Chiranjeevi Invited Star Heroes to meet with AP CM YSJagan on 20th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X