twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాక్సీవాలా టీంతో మెగాస్టార్ చిరంజీవి.. హీరోయిన్‌తో బ్యూటిఫుల్ క్లిక్.. ఫోటోలు!

    |

    మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చిన్న చిత్రాలని బాగా ప్రోత్సహిస్తున్నారు. నూతన నటీనటులకు అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది. టాక్సీవాలా చిత్ర యూనిట్ ని తన నివాసానికి ఆహ్వానించిన చిరు అభినందించారు. చిత్ర నిర్మాత, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్, దర్శకుడు రాహుల్ చిరంజీవిని కలిశారు. చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

     విడుదలకు ముందే

    విడుదలకు ముందే

    అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయాడు. దీనితో విజయ్ నటించే ప్రతిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కానీ టాక్సీవాలా చిత్రం ఆరంభం నుంచే ఇబ్బందులతో ప్రారంభమైంది. విడుదలకు ముందే పైరసీ లీక్ కావడం, దాదాపు రెండేళ్ల పాటు ఈ చిత్రం విడుదలకు నోచుకోకపోవడంతో ఈ చిత్రంపై క్రమంగా అంచనాలు సన్నగిల్లుతూ వచ్చాయి.

    అద్భుత విజయం

    అద్భుత విజయం

    కానీ ఈ చిత్రం విడుదలయ్యాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తొలి షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పైరసీ కూడా ఈ చిత్ర విజయాన్ని అడ్డుకోలేకపోయింది. తొలి రోజునుంచే కలెక్షన్ల వేట ప్రారంభించిన టాక్సీవాలా చిత్రం 25 కోట్లకు పైగా గ్రాస్ తో దూసుకుపోతోంది. చిత్ర యూనిట్ చేసిన ప్రచార కార్యక్రమాలు కూడా సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి. డెబ్యూ దర్శకుడిగా రాహుల్ అదరగొట్టాడు.

    విజయ్ దేవరకొండ డైరెక్టర్‌ని వణికించిన నయనతార.. ఎట్టకేలకు ఆ వివాదం గురించి!విజయ్ దేవరకొండ డైరెక్టర్‌ని వణికించిన నయనతార.. ఎట్టకేలకు ఆ వివాదం గురించి!

    ప్రియాంక జవాల్కర్

    ప్రియాంక జవాల్కర్

    అనంతపురం అమ్మాయి ప్రియాంక జవాల్కర్ టాక్సీవాలా చిత్రంతో హీరొయిన్ గా పరిచయం అయింది. ఈ చిత్రం విజయం సాధించడంతో ప్రియాంక జవాల్కర్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ కు, నటనకు పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర అయినప్పటికీ తన పరిధి మేరకు బాగానే ఆకట్టుకుంది. లుక్స్ పరంగా కుడా మెప్పించింది.

    మెగాస్టార్‌తో కలసి

    మెగాస్టార్‌తో కలసి

    మెగాస్టార్ ఆహ్వానంతో టాక్సీవాలా చిత్ర యూనిట్ ఆయన నివాసానికి వెళ్ళింది. షూటింగ్ కారణంగా విజయ్ దేవరకొండ హాజరు కాలేదు. చిరంజీవి టాక్సీవాలా చిత్ర దర్శకుడు రాహుల్, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్, నిర్మాత ఎస్‌కె‌ఎన్ ని చిరంజీవి అభినందించారు. మెగాస్టార్‌తో ప్రియాంక దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    English summary
    Megastar Chiranjeevi invites Taxiwaala movie team. Photos goes viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X