ఇంటర్నెట్ సెన్సేషన్ 'బేబీ'కి చిరంజీవి ఫోన్.. ఇంటికి రావాలని ఆహ్వానం!
గత కొన్ని వారాలుగా బేబీ అనే పేరు తెలుగు రాష్ట్రలో మారుమోగుతోంది. యూట్యూబ్ , పేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్స్ లో నెటిజన్లంతా బేబీ గానం కోసం వెతుకుతున్నారు. శంకర్ దర్శత్వంలోని చిత్రం ప్రేమికుడులో 'ఓచెలియా నా ప్రియసఖియా' అనే సాంగ్, మణిరత్నం దర్శత్వంలో వచ్చిన బొంబాయి చిత్రంలోని 'కన్నానులే కలయికలు' అనే సాంగ్స్ ని పాడింది. ఎక్కడో గోదావరి జిల్లాలో మారుమూల గ్రామమైన వడిసెలేరుకు చెందిన బేబీ సరదాగా పడిన పాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె గాత్ర మాధుర్యానికి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఫిదా అయిపోయాడు.

సోషల్ మీడియాలో ట్రెండింగ్
గత కొన్ని వారాలుగా బేబీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మరింది. మధురమైన స్వరంతో ఆమె పాడిన పాటలకు అంతా ఫిదా అవుతున్నారు. స్వయంగా దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఫోన్ చేసి అభినందించాడంటే ఆమె స్వర మాధుర్యం గురించి అర్థం చేసుకోవచ్చు. మీడియా సంస్థలు కూడా ఆమె బాగా హైలైట్ చేస్తున్నాయి.
Recommended Video


సంగీత దర్శకుడు కోటి ఆహ్వానం
టాలీవుడ్ ప్రముఖులంతా బేబీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. హైదరాబాద్ రావాలని బేబీకి సంగీత దర్శకుడు కోటి బేబీకి ఆహ్వానం పంపాడు. ఆయన ఆహ్వానం మేరకు హైదరాబాద్ వెళ్లిన బేబీని మరికొంతమంది ప్రముఖులు ఆహ్వానిస్తూ సత్కరిస్తున్నారు. సంగీత దర్శకుడు కోటి బేబీని ఇంటికి ఆహ్వానించారు. అక్కడున్న వారితో పోటీ పడుతూ ఆమె ఓ చెలియా నా ప్రియా సఖియా పాటని పాడారు.

ఎస్పీ బాలు, ఆర్పీ కూడా
ఇక లెజండ్రీ సింగర్ బాలసుబ్రమణ్యం, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా బేబీని ప్రశంసించారు. ఆమె గురించి ఆరా తీశారు. ఇలా ఊహించని పాపులారీతో సంతోషంలో ఉన్నా బేబీకి మరో పెద్ద సర్ ప్రైజ్ ఎదురైంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆమె ఫోన్ కాల్ వచ్చింది. దీనితో బేబీ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. హైదరాబాద్ లోని మిర్రర్ కార్పొరేట్ యాజమాన్యం బేబీని సత్కరించింది.

పాటలు పాడే అవకాశం
ఆ సంస్థ యజమానులు విజయ లక్ష్మి దంపతులు తన పాటలు విని అభినందించారని బేబీ తెలిపింది. తనకు సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఇవ్వాలని విజయలక్ష్మి గారు ప్రముఖ హీరోలందిరిని కోరారని బేబీ తెలిపింది. వారంతా తప్పకుండా ఛాన్స్ ఇస్తామని చెప్పడంతో చాలా సంతోషంగా ఉందని తెలిపింది. శనివారం రోజు మెగాస్టార్ చిరంజీవి తనని ఫోన్ చేసి ఆహ్వానించినట్లు పేర్కొంది.


Click it and Unblock the Notifications











