2017: రీ ఎంట్రీతో అదరగొట్టిన చిరంజీవి, సైరాతో జాతీయ స్థాయికి
2017 సంవత్సరంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యూస్ మేకర్ గా నిలిచిన వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఆయన ఈ ఏడాది ప్రారంభంలో 'ఖైదీ నెం 150' సినిమా ద్వారా బాక్సాఫీసు బరిలో దూకారు. 60 ఏళ్ల వయసులోనూ తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. 'ఖైదీ నెం 150' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది. ఈ సినిమాకు ఇంత భారీ వసూళ్లు సాధించడానకి కారణం ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పక తప్పదు.
Recommended Video

'ఖైదీ నెం 150' విజయం ఇచ్చిన ప్రోత్సహంతో చిరంజీవి మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు. 'సైరా నరసింహారెడ్డి' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం 100 కోట్ల పై చిలుకు బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నేషనల్ లెవల్లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ సినిమా కోసం మెగాస్టార్ ప్రత్యేకంగా ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.



Click it and Unblock the Notifications











