Chiru 156: ప్రభాస్ టీమ్ తో చేతులు కలిపిన మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు ఎవరంటే?

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక మంచి సందేశం ఉండేలా చూసుకుంటున్నారు. నేటి తరం హీరోలకు ఏ మాత్రం తక్కువ కాకుండా జెట్ స్పీడ్ లో షూటింగ్ పనులు పూర్తి చేసుకునేలా ఒక ప్లాన్ అయితే సెట్ చేసుకుంటున్నారు. వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే మరొక డినిమాను కూడా సెట్స్ పైకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఆయన నేటి తరం యువ దర్శకులకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా దర్శకులను సెలెక్ట్ చేసుకుంటున్నారు. డిఫరెంట్ కథలపై కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కథ నచ్చితే దర్శకుల గత ఫలితాలతో సంబంధం లేకుండా ఒకే చెప్పేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ లైనప్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఇక త్వరలోనే మెగాస్టార్ 156వ సినిమా కోసం ప్రభాస్ టీమ్ తో కలిసి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దర్శకుడు, సంగీత దర్శకుడు కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఆచార్య రిలీజ్ పై తుది నిర్ణయం

ఆచార్య రిలీజ్ పై తుది నిర్ణయం


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా పనులన్నీ కూడా దాదాపు ఫినిష్ అయ్యాయి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఆ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై ఇంకా సస్పెన్స్ అయితే వీడలేదు. ఎలాగైనా సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు త్వరలోనే రిలీజ్ డేట్ పై అఫీషియల్ క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. మెగాస్టార్ పుట్టినరోజు రిలీజ్ డేట్ పై ఏదో ఒకటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 మెగాస్టార్ - సల్మాన్ ఖాన్..?

మెగాస్టార్ - సల్మాన్ ఖాన్..?

అలాగే లూసీఫర్ రీమేక్ ను ఇటీవల సెట్స్ పైకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా దర్శకుడు కథను సరికొత్తగా మార్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు ఇటీవల టాక్ అయితే వచ్చింది. కానీ ఆ విషయంపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సల్మాన్ ఖాన్ రిజెక్ట్ చేశాడనే టాక్ కూడా వచ్చింది.

మరో రెండు సినిమాలు..

మరో రెండు సినిమాలు..

బాబి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. లూసిఫర్ సినిమాతో పాటు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న మాస్ యాక్షన్ సినిమాను కూడా మెగాస్టార్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా మెగాస్టార్ ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా తమిళ్ బాక్సాఫీస్ హిట్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా రాబోతోంది ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి. మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఒక స్టార్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా..

మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా..

మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ అయినటువంటి యు.వి.క్రియేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్స్ కూడా ఆ ప్రాజెక్టు కోసం సహా నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు టాక్. అయితే ఇదివరకే యు.వి.క్రియేషన్స్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాలని టార్గెట్ అయితే సెట్ చేసుకుంది. అయితే దానికంటే ముందే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తుండడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో రామ్ చరణ్ తేజ ఏదో ఒక విధంగా భాగమైతే అవుతున్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Megastar Chiranjeevi Promise To Sohel | Chiru Bumper Offer To Divi
దర్శకుడు ఎవరంటే..

దర్శకుడు ఎవరంటే..

ఇక మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా దర్శకుడు ఎవరనే విషయం లో కి వెళ్తే మొన్నటి వరకు ఓ వర్గం మీడియం హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చిన కామెడీ దర్శకుడు మారుతి ఫిక్స్ అయినట్లు సమాచారం. అతను మెగాస్టార్ సినిమాకు మొదటి సారి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవిని ఎంతగానో ఆరాధిస్తున్న మారుతి ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కామెడీ సినిమా చేయాలని చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇక ఇటీవల యు.వి.క్రియేషన్స్ నిర్మాతలతో మాట్లాడిన మారుతి డిఫరెంట్ కామెడీ కథను వినిపించినట్లు సమాచారం. మెగాస్టార్ కూడా దర్శకుడు టాలెంట్ గురించి తెలుసుకొని సింగిల్ సిట్టింగ్ లోనే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అఫీషియల్ గా సినిమా ఎనౌన్స్మెంట్స్ చాలా వరకు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఆగస్ట్ 22న వెలువడే ఛాన్స్ ఉన్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X