twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒలంపిక్ షూటర్ వద్ద మెళుకువలు నేర్చుకున్న చిరంజీవి.. తెల్లోడి గుండెల్లో దిగేలా!

    |

    మెగాస్టార్ చిరంజీవి ఇటీవల జార్జియాలో భారీషెడ్యుల్ ముగించుకుని ఇండియా వచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజా చిరు తుపాకీ షూటింగ్ కు సంబంధించిన మెళుకువలు తెలుసుకోవడం ఆసక్తిగా మారింది.

    ఒలంపిక్ షూటర్ గగన్ నారంగ్‌తో

    ఒలంపిక్ షూటర్ గగన్ నారంగ్‌తో

    హైదరాబాద్ లో చిరంజీవి షూటింగ్ ఛాంపియన్ గగన్ నారంగ్ ని కలిశారు. నారంగ్ ప్రొఫెషనల్ షూటర్ కనుక ఆయనకు అన్ని రకాల తుపాకుల గురించి తెలిసే ఉంటుంది. షూటింగ్ లో అద్భుత ప్రావీణ్యం ఉంటుంది. దీనితో చిరు బ్రిటిష్ కాలం నాటి తుపాకులు, వాటిని వాడే విధానం గురించి నారంగ్ వద్ద మెళుకువలు తెలుసుకున్నారు.

     సైరా కోసం

    సైరా కోసం

    జార్జియాలో భారీ యుద్ధ సన్నివేశాలు పూర్తి చేసుకుని వచ్చిన సైరా టీం మరో మేజర్ షెడ్యూల్ కు సిద్ధం అవుతోంది. ఈ షెడ్యూల్ లో బ్రిటిష్ వారితో తుపాకులతో పోరాడే సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు.

    నేను ఆంజనేయ స్వామి భక్తుడ్ని.. 150 సినిమాలు, ఇలాంటి నీచమైన పని చేస్తానా! నేను ఆంజనేయ స్వామి భక్తుడ్ని.. 150 సినిమాలు, ఇలాంటి నీచమైన పని చేస్తానా!

    సరదాగా మాట్లాడుకున్నాం

    మెగాస్టార్ చిరంజీవి తనని కలసిన విషయాన్ని గగన్ నారంగ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి గారితో షూటింగ్ గురించి చాలా విషయాలు సరదాగా చర్చించా అని నారంగ్ తెలిపాడు. గగన్ నారంగ్ 2012 ఒలంపిక్స్ లో బ్రాంజ్ మెడల్ విజేతగా నిలిచాడు.

    బ్రేక్ తీసుకుని

    బ్రేక్ తీసుకుని

    ఇదిలా ఉండగా భారీ షెడ్యూల్ ముగియడంతో చిరు కొన్ని రోజులు బ్రేక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తిరిగి మళ్ళీ కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభిస్తారు. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2019 వేసవిలో సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Megastar Chiranjeevi meets olympic shooter Gagan Narang. Learn some shooting techniques for SyeRaa
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X