HBD Megastar Chiranjeevi: MEGA156 అనౌన్స్‌మెంట్‌.. కానీ ఈ కొత్త కన్ఫ్యూజన్ ఏంటి బాసూ?

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. ఆయన ఈరోజు 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెగా 156 మూవీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక తన కూతురు సుస్మిత కొణిదల నిర్మాణంలో ఈ సినిమా చిరంజీవి చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. రాజకీయ ప్రముఖుల నుంచి సినీ ప్రముఖుల వరకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే చిరు బర్త్ డేను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ తన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది. దానికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ అయ్యి వైరల్ గా మారింది.

Chiranjeevi

మెగాస్టార్ బర్త్ డే కానుకగా మెగా 156 పోస్టర్ రిలీజ్ అయింది. తన కూతురు సుస్మిత కొణిదల... గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనుంది. ఇక ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన వివరాలతో పాటు పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరు లుక్ ఆకట్టుకుంటుంటోంది.

Chiranjeevi

భోళా శంకర్ వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత చిరు మూవీ చేస్తున్న మూవీ కావడంతో ఆసక్తి నెలకొంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీని చిరంజీవి ఎందుకు చేశారు రా బాబు అని ఫ్యాన్స్ నుంచి విమర్శలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

Chiranjeevi

అయితే మెగా 156 మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. కానీ మూవీ డైరెక్టర్ విషయంలో క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఇంతకుముందు బంగార్రాజు మూవీ ఫేం డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వచ్చాయి, ఆ తర్వాత డైరెక్టర్ మురగదాస్ కూడా మెగా 156 మూవీకి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినా ... డైరెక్టర్ పేరును మాత్రం ప్రకటించలేదు. ఈ కొత్త కన్ఫ్యూషన్ ఏంటి అని నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు.

Chiranjeevi

ఇక ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల గోల్డ్ బాగ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించనుంది. ఇప్పటికే ఈ మూవీలో శర్వానంద్ కూడా నటిస్తారని ప్రకటించారు. ఇక ఈ మూవీకి కళ్యాణ్ కృష్ణ డైరెక్టరా కాదా అనేది సందేహం అయితే నెలకొంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన వర్క్ మరో నెల రోజుల్లో మొదలవుతుందని సమాచారం. ఈ మూవీ దసరా తర్వాత షూటింగ్ ఉంటుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ రోజు మెగాస్టార్ బర్తడే కానుకగా విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. మరి సాయంత్రం ఇంకా ఏమైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X