twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ కోసం దివ్యాంగ అభిమాని పాదయాత్ర... చలించిపోయిన చిరు.. కలిసి ఏమన్నారంటే?

    |

    ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన మరో అభిమాని విషయంలో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఎవరా అభిమాని? అసలు విషయం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే.

    పాదయాత్రలు చేస్తూ

    పాదయాత్రలు చేస్తూ

    ఈ మధ్య కాలంలో తమ అభిమాన హీరో హీరోయిన్ల ను కలవడం కోసం వారు ఉంటున్న ప్రాంతానికి పాదయాత్రగా వెళుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం, వరుణ్ తేజ్ కోసం, అల్లు అర్జున్ కోసం, సోనూసూద్ కోసం ఇలా చాలా మంది కోసం వారి వారి అభిమానులు పాదయాత్రగా హైదరాబాద్ వచ్చిన ఘటనలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. ముంబై లో ఉంటున్న సోనూసూద్ కోసమైతే నిజామాబాద్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు ఓ అభిమాని.

    చర్చనీయాంశంగా

    చర్చనీయాంశంగా

    వీరు మాత్రమేనా హీరోయిన్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా, హీరోయిన్ రష్మిక మందన ఫ్యాన్ ఒకరు ఆమె కోసం నడుచుకుంటూ ముంబై వెళ్ళాడు. అంత దూరం నుంచి వస్తున్నారని తెలిసిన తర్వాత ఎవరైనా కలవకుండా ఉంటారా చెప్పండి అలా ఈజీగా తమ తమ అభిమాన హీరో హీరోయిన్లను కలిసే మార్గాన్ని కనుగొన్నారు ఫాన్స్. అయితే కాలు చేయి చక్కగా ఉండి నడుస్తూ వచ్చారంటే అర్థం ఉంది కానీ మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక దివ్యాంగ అభిమాని చేసిన సాహసం మాత్రం ఇప్పుడు టాలీవుడ్ మొత్తం మీద చర్చనీయాంశమవుతోంది.

    726 కిలో మీటర్ల దూరం

    726 కిలో మీటర్ల దూరం

    తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకా లోని ఉప్పలగుప్తం అనే మండలానికి సంబంధించిన కిత్తన చెరువు అనే గ్రామంలో డెక్కల గంగాధర్ అనే 32 ఏళ్ల దివ్యాంగుడు నివసిస్తున్నాడు. అతని తల్లి తండ్రి కూడా కాలం చేశారు. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ డబ్బుతో బతికే గంగాధర్ చిరంజీవికి వీరాభిమాని. జీవితంలో ఒక్కసారైనా చిరంజీవిని కలవాలి అనే ఉద్దేశంతో ఆయన తన ఉంటున్న ప్రదేశం నుంచి హైదరాబాద్ లోని చిరంజీవి నివాసం వరకు పాదయాత్ర చేస్తూ వెళ్లాలని భావించాడు..

    మాస్టర్ రిలీజ్ సంద్భంగా

    మాస్టర్ రిలీజ్ సంద్భంగా

    అలాగే అక్టోబర్ మూడవ తారీకున చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గంగాధర్ పాదయాత్ర ప్రారంభించాడు.. సుమారు 22 రోజుల తర్వాత 726 కిలోమీటర్ల దూరం నడిచిన గంగాధర ఎట్టకేలకు హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు కు చేరుకున్నాడు. తనకోసం ఒక అభిమాని 700 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేస్తూ వచ్చాడు అనే విషయం తెలుసుకున్న చిరంజీవి అప్పటికప్పుడు ఆయనను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు.

    Recommended Video

    Megastar Chiranjeevi Special Interview with Natyam Movie Team
    చలించిన చిరు

    చలించిన చిరు

    తన కోసం ఇంత సాహసం చేశాడనే విషయం తెలిసి చలించిపోయిన చిరంజీవి తన అభిమాని డెక్కల గంగాధర్ తో కూర్చుని గంగాధర్ కుటుంబ నేపథ్యం గంగాధర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే దివ్యాంగుడు అయ్యుండి ఇంతటి సాహసానికి ఒడి గట్టారన్న విషయం మీద సున్నితంగా చిరంజీవి ఆయనకు క్లాస్ తీసుకున్నారు.. అయితే తన అభిమాన హీరోని కలిస్తే చాలు అని భావించిన గంగాధర్ స్వయంగా తన అభిమాన హీరో తన ఇంటికి పిలిపించుకుని ఇంత సేపు మాట్లాడిన విషయం మీద ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. గంగాధర్ అభిమానానికి అయితే అవధులు లేకుండా పోయాయి.

    English summary
    megastar's physically challenged fan name the dekkala Gangadhar came by padyatra to Hyderabad, Chiranjeevi met him in his residence. మె
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X