Mega 156 టైటిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. సినిమా వచ్చేది మాత్రం అప్పుడేనట!
మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. ముఖ్యంగా చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఆయన హీరోగా ఏ సినిమా చేసినా పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్తూ రచ్చ చేస్తున్నారు. ఫ్యాన్స్ జోరు చూసిన చిరంజీవి కూడా అందుకు తగ్గట్లుగానే సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏటా రెండేసి చిత్రాల్లో నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే గతేడాది రెండు సినిమాలు చేయగా.. ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిల్చింది. మరో సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు.
అయితే భోళా శంకర్ ఫ్లాప్ గా నిలవడంతో.. చిరంజీవి నెక్స్ సినిమాపై మరింత శ్రద్ధ పెట్టారు. ఈ సారి కచ్చితంగా హిట్టు కొట్టాలనే కసితో తనకు నచ్చిన కథ కోసం వెతకగా.. బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ట ఓ కథ చెప్పడం అది చిరంజీవికి నచ్చడంతో సినిమాను లాక్ చేసుకున్నారు. గతేడాది అంటే 2023 అక్టోబర్ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించుకుని సినిమాను ప్రారంభించారు. అయితే చిరంజీవికి ఈ సినిమా 156వ చిత్రం కావడంతో దీనికి Mega 156 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.

యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని గతంలోనే సంగీత దర్శకుడు కీరవాణి తెలిపారు. ఎంఎం కీరవాణియే ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అలాగే చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాధ్యతలు చూసుకోబోతున్నారు. అలాగే డైలాగ్స్ ను సాయి మాధవ్ బుర్రా రాయనున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల వ్యవహరించనున్నారు.
మొత్తం 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. అలాగే సోషియో ఫాంటసీ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా మూడు లోకాల చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. దేవ, మానవ, పాతాళ లోకాల్లో ఓ పాప చుట్టూ తిరుగుతుందట. అయితే ఈ సినిమా విశ్వంభర అనే టైటిల్ అనుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ తాజాగా చిత్రబృందం టైటిల్ రిలీజ్ డేట్ ను విడుదల చేసింది.

వశిష్ట, చిరంజీవి కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు సంక్రాంతి పండుగ సందర్భంగా చిరు ఫ్యాన్స్ కోసం చిత్ర బృందం ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతుంది. Mega 156 సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు. జనవరి 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు చిరంజీవి 156వ సినిమా టైటిల్ ను విడుదల చేస్తామని అన్నారు. రేపటి వరకు ఆగితే చాలు ఈ సినిమా పేరేంటో తెలిసిపోతుంది.అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు.


Click it and Unblock the Notifications











