twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Waltair Veerayya Event: అసలు కలెక్షన్స్ పై మెగాస్టార్ క్లారిటీ.. ఈ విజయానికి ప్రధాన కారణం వారే అంటూ..

    |

    మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ శనివారం రోజు వరంగల్ లో నిర్వహించారు.

    ఈ వేడుకకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు రామ్ చరణ్ తేజ్ కూడా ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సినిమా విజయానికి గల కారణాలను అలాగే బాక్సాఫీస్ కలెక్షన్స్ పై కూడా కొంత వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలలోకి వెళితే..

    మీ ప్రేమ తగ్గలేదు

    మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నేను ఇప్పుడు వరంగల్ కు వచ్చినా కూడా ఎంతో ప్రేమను ఆప్యాయతను చూపిస్తూ ఉంటారు. ఒకప్పుడు ప్రచారం కోసం ఇక్కడ చాలా తిరిగాను. అప్పటికి ఇప్పటికీ మీ ప్రేమ ఏమీ తగ్గలేదు. సక్సెస్ ఈవెంట్ ను ఎక్కడ నిర్వహించాలి అని అనుకున్నప్పుడు అందరం ఒకేసారి వరంగల్ అని అనుకున్నాము. ఈ విజయోత్సవం కోసం మీరందరూ రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అని చిరంజీవి అన్నారు.

    బాక్సాఫీస్ కలెక్షన్స్

    బాక్సాఫీస్ కలెక్షన్స్

    ఈ సినిమా ఈ స్థాయిలో విజయాన్ని అందుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులను ఈ సినిమా అందుకుంది. సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అవుతుంది అని అనుకోలేదు. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర కేవలం ప్రేక్షకులది మాత్రమే. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 250 కోట్లకు చేరువయ్యింది. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.. అని చిరు అన్నారు.

    మళ్ళీ అలాంటి ఆనందం

    మళ్ళీ అలాంటి ఆనందం

    వాల్తేరు వీరయ్య సినిమాను చూసి మీరంతా నా గత చిత్రాలను గుర్తు చేసుకోవడం కూడా ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమా కోసం దర్శకుడు బాబి ఎంతగానో కష్టపడ్డాడు. ఇందులో మీరు నన్ను ఒక గ్యాంగ్ లీడర్ అలాగే ఘరానా మొగుడు ఇలా ఎన్నో సినిమాలను ఊహించుకొని చూశారు. నా సినిమా కెరిర్ లో ఒక ఖైదీ హిట్ అయినప్పుడు ఎంత ఆనందపడ్డానో ఇప్పుడు అంతే స్థాయిలో నేను ఆనంద పడుతున్నాను.. అని మెగాస్టార్ తెలియజేశారు.

    బాబీ గొప్పతనం

    బాబీ గొప్పతనం

    ఈ సినిమా కోసం ప్రధానంగా దర్శకుడు బాబి చాలా కష్టపడ్డాడు. ఇక అతనికి తోడుగా నిర్మాతలు కూడా కావాల్సినంత సపోర్ట్ ఇచ్చారు. ఎక్కడా కూడా దర్శకుడు బాబి ఖర్చు వృధా చేయలేదు. ఏదైనా అనవసరం అనుకుంటే స్క్రిప్ట్ దశలోనే దానిని పక్కన పెట్టేసేవాడు. ఒకటి రెండు సీన్స్ తప్పితే షూటింగ్ తర్వాత ఏవి కూడా ఎడిట్ లో తీసేయలేదు. ఆ విధంగా అతను జాగ్రత్త పడ్డాడు. ఇలాంటి దర్శకులే నిర్మాతలకు కావాలి. అని మెగాస్టార్ తెలియజేశారు.

    మన దేశానికి గర్వకారణం

    మన దేశానికి గర్వకారణం

    ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ రాంచరణ్ రంగస్థలం సినిమాలో చేసిన పాత్ర ఇప్పటికే నేను మర్చిపోలేను. ఇక అతనికి పెద్దగా అవార్డులు రాకపోయినప్పటికీ ఆ పాత్ర మాత్రం అందరికి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇక రీసెంట్ గా నాటు నాటు పాట దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు అందుకునే విధంగా ఆస్కార్ కు నామినేట్ కావడం విశేషం. ఇది మన దేశానికి గర్వకారణం అని మెగాస్టార్ చిరంజీవి వివరణ ఇచ్చారు.

    English summary
    Megastar chiranjeevi powerful speech in waltair veerayya success event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X