Don't Miss!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆత్మల గెటప్స్‌లో చిరు, రాంచరణ్, బన్నీ.. మెగా ఫ్యామిలి హాలోవీన్ సంబరాలు!
Recommended Video
మెగా ఫ్యామిలీ హాలోవీన్ సంబరాల పేరుతో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ పార్టీలో పాల్గొని సరదాగా గడిపారు. కానీ వారు ధరించిన కాస్ట్యూమ్స్ మాత్రం భయాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. హాలోవీన్ గురించి తెలిసిన వాళ్ళు ఈ ఫోటోలని బాగా వైరల్ చేస్తున్నారు. తెలియని వాళ్ళు అసలు ఇంతకీ హాలోవీన్ అంటే ఏంటి అని ఆరా తీయడం ప్రారంభిస్తున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం హాలోవీన్ సంబరాలకు సంబందించిన వివరాలు ఇప్పుడు చూద్దాం!
మరో పాశ్చాత్త సాంప్రదాయం
నెమ్మదిగా పాశ్చాత్య సాంప్రదాయాలు ఇండియాలో ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. మనకు తెలియకుండానే చాలా పాశ్చాత్య వేడుకల్ని జరుపుకుంటూనే ఉన్నాం. శతాబ్దాల చరిత్ర ఉన్నా హాలోవీన్ పండుగ కూడా ఇప్పుడు ఇండియాలో విస్తరిస్తోంది. అమెరికా, బ్రిటన్ వంటి క్రిస్టియన్ సంప్రదాయాలు ఉన్న దేశాల్లో ఈ వేడుకలు బాగా ఫేమస్.
టాలీవుడ్‌కు మరో మెగా హీరో.. క్రేజీ ప్రాజెక్ట్‌తో తెరపైకి.
హాలోవీన్ అంటే
హాలోవీన్ సంబరాలు అక్టోబర్ 31 న జరుగుతాయి. ఈ వేడుకకు కొన్ని రోజుల ముందునుంచే సంబరాలు మొదలవుతాయి. దేవుడి కోసం, దేశం కోసం పవిత్రమైన కార్యాలు నిర్వహించిన స్వర్గస్తులైన వారిని గుర్తు చేసుకోవడం కోసం ఈ పండుగ నిర్వహిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి పనులకోసం మరణించిన వారిని గుర్తు చేసుకునే విధంగా ఈ పండుగ ఉంటుంది.
సరదా సరదాగా
హాలోవీన్ వేడుకలు చాలా సరదాగా జరుగుతాయి. ఈ పండుగ జరుపుకునే సమయంలో హర్రర్ సినిమాలలో మాదిరిగా దెయ్యాల కాస్ట్యూమ్స్ ధరిస్తారు. గుమ్మడి కాయ లోపల దీపాలు వెలిగిస్తారు. పిల్లలు పెద్దలు కలసి హర్రర్ కథలు చెప్పుకుంటారు. సరదాగా ఉండే ఆటలు ఆడుతారు. సాయంత్రం నుంచి ఈ సంబరాలన్నీ మొదలవుతాయి.
మెగా ఫ్యామిలీ
హాలోవీన్ వేడుకల్ని మెగా ఫ్యామిలీ మొత్తం జరుపుకోవడం ఆసక్తిగా మారింది. మెగాస్టార్ చిరంజీవి సహా రాంచరణ్, బన్నీ, సాయిధరమ్ తేజ్, నిహారిక ఇలా కుటుంబ సభ్యులంతా దెయ్యం కాస్ట్యూమ్స్ లో కనిపించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అత్తతో సరదాగా
ఉపాసన తన అత్త సురేఖతో సరదాగా కనిపించింది. దెయ్యం కాస్ట్యూమ్ వేస్తుండగా సురేఖ భయపడుతూ కనిపించింది. మెగా ఫ్యామిలీ స్టార్స్ తో పేరు పిల్లలు కూడా ఈ హాలోవీన్ పార్టీలో పాల్గొన్నారు. గత రాత్రి మెగాస్టార్ నివాసంలో ఈ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది.