twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని అభినందిస్తున్నా..మరో రెండు వారాల్లో కొత్త జీవో.. సీఎంకి అభినంద‌న‌లు- చిరంజీవి

    |

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ ముగిసింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలపై చర్చలు జరిగాయి. ఇక ఈ భేటీ అనంతరం చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు.

    అభ్యర్థిస్తున్నా

    అభ్యర్థిస్తున్నా

    ఇండస్ట్రీ సమస్యల పై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. టికెట్ రేట్లు పెంపు విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ పనులు ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. టికెట్ ధరల గురించి మాట్లాడవద్దని మా పరిశ్రమ సహచరులను నేను అభ్యర్థిస్తున్నానని అయన అన్నారు.

    కమిటీ చూసుకుంటుంది

    కమిటీ చూసుకుంటుంది

    జగన్ తో మీటింగ్ సంతృప్తికరంగా జరిగిందన్న ఆయన సినీ పరిశ్రమ ల సమస్యల జగన్ గారికి వివరించాను అని ఆయన పరిష్కరించే దిశగా సానుకూలంగా స్పందించారు అని అన్నారు. జీఓ 35 గురుంచి పునారలోచిస్తా అని హామీ ఇచ్చారని పేర్కొన్న చిరంజీవి ఈ సమస్య పరిష్కరించే వరకు దయచేసి ఎవరు మాట్లాడొద్దని అన్నారు. మా సమస్యలను వివరించాను, సీఎం సానుకూలంగా స్పందించి కమిటీ చూసుకుంటుందని చెప్పారు, అతి త్వరలో ముసాయిదా సిద్ధం చేసి దీనిపై TFIతో సంప్రదింపులు జరుపుతారని అన్నారు.

    రెండు వారాల్లో, కొత్త GO

    రెండు వారాల్లో, కొత్త GO

    ఇక ఒకటి లేదా రెండు వారాల్లో, కొత్త GO వస్తుందని భావిస్తున్నా అని పేర్కొన్నారు. ఇక ఈ భేటీలో ఆన్‌లైన్ టికెటింగ్, టిక్కెట్ రేట్లు, జిఓ నెం. 35, అదనపు షోలు, థియేటర్‌లకు కరోనా రిలీఫ్, బి ఫారం లైసెన్స్ సమస్యలు, షూటింగ్ పర్మిట్‌లపై జగన్ - చిరు మధ్య చర్చ జరిగింది అని అంటున్నారు. ఇక 13 మంది సభ్యుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు చెందిన బృందంతో మరో సమావేశం ఉంటుందని అన్నారు.

    అంద‌రినీ స‌మ‌దృష్టితో చూస్తా

    అంద‌రినీ స‌మ‌దృష్టితో చూస్తా

    ఇక ఏదో మంచి చేయాల‌న్న ఆలోచ‌న ప్ర‌భుత్వం వైపు నుంచి ఉందని, నేను ఒక ప‌క్షాన ఉండ‌ను, అంద‌రినీ స‌మ‌దృష్టితో చూస్తాన‌ని సీఎం జగన్ చెప్పారని చిరంజీవి పేర్కొన్నారు. భ‌య‌ప‌డొద్ద‌ని ముఖ్యమంత్రి భ‌రోసా ఇచ్చారని, సీఎం మాట‌లు నాకు ధైర్యమిచ్చాయాని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. మంచి వాతావ‌ర‌ణంలో స‌మావేశం జ‌రిగిందన్న చిరంజీవి సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశం సంతృప్తిని క‌లిగించిందని, సామాన్య ప్ర‌జ‌ల‌కు వినోదం అందుబాటులో ఉండాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని అభినందిస్తున్నానాని కూడా అన్నారు.. అలాగే సీఎం ప్ర‌య‌త్నానికి అభినంద‌న‌లు అని చిరంజీవి పేర్కొన్నారు.

     బయటకు కనిపించేంత గ్లామర్ లేదు

    బయటకు కనిపించేంత గ్లామర్ లేదు


    అలాగే ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇండస్ట్రీ ఎదుర్కొనే పరిస్థితులు తాను జగన్ దృష్టికి తీసుకువెళ్లానని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ బయటకు కనిపించేంత గ్లామర్ లేదన్న ఆయన ఇండస్ట్రీలోని కార్మికులకు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఉందని చిరంజీవి అన్నారు. ఇలాంటి పేద కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉందని తెలిపారు. థియేటర్ల యాజమాన్యాలకు కూడా ధైర్యం కల్పించాల్సిన అవసరముందన్న చిరంజీవి సినీ పరిశ్రమ వారందరికీ ఒక పెద్ద టెన్షన్ క్లియర్ చేసినట్టే చెప్పాలి. మరి ఆయన అన్నట్టుగా ప్రభుత్వ కొత్త జీవో ఎప్పటికి వస్తుందో వేచి చూడాలి మరి.

    English summary
    Megastar Chiranjeevi reveals meeting with jagan was successful.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X